తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఆలీతో సరదాగా సీజన్ 2' షురూ - ప్రభాస్​తో మల్టీస్టారర్ - హింట్ ఇచ్చిన గోపిచంద్! - ఆలీతో సరదాగా సీజన్ 2 ప్రోమో

Ali Tho Saradaga Season 2 Latest Promo : ఈటీవీలో ప్రసారమవుతున్న అలీతో సరదాగా షో మరో నయా సీజన్​తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రోగ్రామ్​కు సంబంధించిన నయా ప్రోమో విడుదలైంది. అందులో స్పెషల్ గెస్ట్​గా హాజరైన గోపిచంద్​ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు.

Ali Tho Saradaga Season 2 Latest Promo
Ali Tho Saradaga Season 2 Latest Promo

By ETV Bharat Telugu Team

Published : Mar 1, 2024, 9:35 PM IST

Updated : Mar 1, 2024, 9:47 PM IST

Ali Tho Saradaga Season 2 Latest Promo :తన కామెడీ టైమింగ్​తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు నటుడు అలీ. అయితే ఆయన సినిమాలకే పరిమితం కాకుండా బుల్లితెరపై అప్పుడప్పుడు సందడి చేస్తుంటారు. అలా ఆయన టీవీల్లో పలు షోలకు యాంకరింగ్ చేశారు. అయితే అందులో 'అలీతో సరదాగా'కి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈటీవీలో ప్రసారమైన ఈ షో దాదాపు ఏడేళ్ల పాటు నిర్విరామంగా ప్రేక్షకులను అలరించింది. అయితే 2022లో చివరి సారిగా టెలికాస్ట్ అయింది. ఇక అప్పుడు ఎండ్ అయిన ఈ ప్రోగ్రామ్​ దాదాపు రెండేళ్ల తర్వాత ఇప్పుడు నయా సీజన్​తో మరోసారి బుల్లితెర ఆడియెన్స్​ను ఆకట్టుకోనుంది.

తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట విడుదలైంది. ఇక తొలి ఎపిసోడ్​కు గెస్ట్​గా మ్యాచో మ్యాన్ గోపీచంద్ హాజరయ్యారు. తన అప్​కమింగ్ మూవీ 'భీమా' ప్రమోషన్స్​లో భాగంగా ఆయన ఈ షోకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆలీకి గోపీచంద్​కు మధ్య సరదా సంభాషణ సాగింది.

మాటల మధ్యలో ఆలీ అడిగిన ఓ ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్​ చేస్తోంది. 'మీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాని పోస్టర్ కూడా మా దగ్గర ఉంది' అంటూ ఆలీ అడిగారు. దానికి గోపిచంద్​ కాసేపు నవ్వుకున్నారు. అయితే అసలు విషయం ఏంటో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్​ వచ్చేంతవరకు వెయిట్​ చేయాల్సిందే.

'మీరు ఓకే అంటే నేను సిద్ధమే'
Bhima Movie Promotions :అయితే ఇదే మూవీ ప్రమోషన్స్​లో భాగంగా మరో ఇంటర్వ్యూకు హాజరయ్యారు గోపీచంద్​. అందులో గోపిచంద్​తో పాటు మూవీ టీమ్​ సందడి చేసింది. ఇక ఇక్కడ కూడా ప్రభాస్​, గోపీచంద్ మల్టీస్టారర్​పై చర్చలు జరిగింది. 'మీ ఇద్దరూ మళ్లీ కలిసి నటిస్తారా?' అంటూ యాంకర్‌ అడగ్గా, ఎప్పుడనేది తెలియదుగానీ తనతో నేను తప్పకుండా ఓ సినిమా చేస్తానంటూ గోపీచంద్‌ చెప్పారు.

మిగతా విషయాల గురించి ఇంకా ఏమనుకోలేదంటూ చెప్పిన మ్యాచో మ్యాన్ ఛాన్స్ వస్తే ప్రభాస్‌తో కలిసి మళ్లీ నటించాలనుందని తనతో పాటు ఫ్యాన్స్ మనసులోని మాటను చెప్పారు. ఇక ఈ కాంబోలో సినిమా నిర్మించేందుకు తాను సిద్ధమంటూ ఇదే ఇంటర్వ్వూలో పాల్గొన్న నిర్మాత కె.కె. రాధామోహన్‌ తెలిపారు.

Gopichand Srinu Vaitla : ఇటలీలో గోపిచంద్ - శ్రీనువైట్ల మూవీ షూటింగ్​... అమేజింగ్​ లొకేషన్స్​తో వీడియో రిలీజ్​​.. చూశారా?

బాలయ్యకు ట్విస్ట్​ ఇచ్చిన ప్రభాస్​.. ఇంట్రెస్టింట్​గా అన్​స్టాపబుల్​ ప్రోమో

Last Updated : Mar 1, 2024, 9:47 PM IST

ABOUT THE AUTHOR

...view details