Naga Chaitanya Multi Starer :అక్కినేని నాగచైతన్య- సాయి పల్లవి లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'తండేల్'. యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను తెరకెక్కించారు. ఫిబ్రవరి 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. తాజాగా మూవీటీమ్ ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో పలు చైతూకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.
'మీ తమ్ముడు అఖిల్, అల్లు అర్జున్ అవకాశం వస్తే ఈ ఇద్దరిలో ఎవరితో మల్టీస్టారర్ చేస్తారు?' అని అడిగారు. దీనికి అఖిల్‌తో కలిసి 'మనం' సినిమాలో కనిపించామని చైతూ తెలిపారు. అందుకే అల్లు అర్జున్‌తో మల్టీస్టారర్ చేస్తానని ఆన్సర్ ఇచ్చారు. ప్రస్తుతం చైతూ కామెంట్స్ సోషల్ మీడియా ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. చైతూ ఫ్యాన్స్, బన్నీ అభిమానులు తెగ స్పందిస్తున్నారు. మల్టీస్టారర్ కోసం వెయిటింగ్ అని కామెంట్స్ పెడుతున్నారు. ఏ డైరెక్టర్ స్క్రిప్ట్ రెడీ చేస్తారోనని డిస్కస్ చేసుకుంటున్నారు.
చీఫ్ గెస్ట్‌గా బన్నీ
ఫిబ్రవరి 2 (ఆదివారం)న హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా రానున్నట్లు మేకర్స్ తెలిపారు. దీంతో అల్లు, అక్కినేని అభిమానులకు బన్నీ, చైతూను ఒకే స్టేజ్‌పై చూసే ఛాన్స్ వచ్చింది.