Akhanda 2 Balayya Role : యాక్షన్ సినిమాల్లో మెరవాలన్న, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేయాలన్న అది నందమూరి నటసింహం బాలకృష్ణకే సాధ్యం. ఈయన ఓవైపు డేంజరస్ ఫీట్స్ చేస్తునే, మరోవైపు తన డైలాగ్ డెలివరీతో అభిమానులను ఆకట్టుకుంటారు. అయితే ఈయన నటనకు బోయపాటి మెరుగులు దిద్ది తీసిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అఖండ విజయాన్ని సాధించాయి. ఇప్పుడు అదే జోష్‌తో ఈ కాంబో మళ్లీ 'అఖండ 2 : తాండవం' కోసం కలిసి పని చేస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభవ్వగా, అభిమానులు ఈ మూవీ అప్డేట్స్ గురించి తెగ ఆరా తీస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట తెగ వైరలై ప్రేక్షకుల్లో 'అఖండ 2'పై మరించ అంచనాలు పెంచుతోంది. అదేంటంటే?
నిజ జీవితంలో బాలకృష్ణ సంప్రదాయలకు ఎంత విలువనిస్తారో అందరికీ తెలిసిందే. ఆయనకు దేవుడంటే అమితమైన భక్తి. 'అఖండ 2 : తాండవం'లో ఆయన ఇలానే కనిపించనున్నారట. ఆచారాల కోసం పోరాడే ఓ పాత్రకు ఈ చిత్రంలో ప్రాణం పోయనున్నట్లు సినీ వర్గాల టాక్. అయితే ఈ చిత్రం తొలి భాగంలో భాగంలోనూ బాలయ్య శివ భక్తుడిగా కనిపించారు. ఆ పాత్రలో ఎంతో చక్కగా ఒదిగిపోయి ఆకట్టుకున్నారు. ఇప్పుడీ రెండో భాగంలో ఆయన పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఆలయాలను, అలాగే వాటి పవిత్రతను కాపాడే ఓ పాత్రలో ఆయన కనిపించనున్నట్లు సమాచారం.