Ajay Devgn Guest Role Remuneration :ప్రస్తుతం స్టార్ హీరోల పారితోషికాలు డబుల్ సెంచరీల్లో ఉంటున్నాయి. ఒక్కో సినిమాకు వాళ్ల రేంజ్‌లోనే రెమ్యూనరేషన్ పెరుగుతుంది. దీంతో సినిమాలకు అనుగుణంగా ఆయా స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు దాదాపు రూ.100కోట్లకు పైగా తీసుకుంటున్నారు. అలా సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోలు చాలా మందే ఉన్నారు.
ఆ లిస్ట్‌లో అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, ప్రభాస్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, దళపతి విజయ్ వంటి వారు కూడా ఉన్నరు. ఈ హీరోలందరూ ఒక్కో చిత్రానికి రూ. 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే వారిలో కొందరు రెమ్యూనరేషన్‌తో పాటు సినిమాలో లాభాలను తీసుకుంటున్నారట. అలా ఒక సినిమాకు రూ. 200 కోట్లకు పైగా వసూలు చేస్తున్నారని సమచారం. ఈ లెక్క ప్రకారం వారి సంపాదన నిమిషానికి రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకు ఉంటుంది.
అయితే ఒక స్టార్ హీరో మాత్రం సినిమాలో గెస్ట్ రోల్ కోసం రూ.35 కోట్లు తీసుకున్నారు. అంటే నిమిషానికి రూ. 4.5 కోట్లు వసూలు చేశారు. ఆయనెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్. ఈయన 2021లో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్'లో నటించారు. ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్‌కు తండ్రిగా కనిపించారు. ఫ్లాష్‌బ్యాక్‌లో ఆయన పార్ట్ కీలకం.