Actress Who Were Rejected In Auditions : సినీ పరిశ్రమలో సక్సెస్, ఫెయిల్యూర్లు సహజమే.అందం, అభినయం ఉన్నా కొన్ని సార్లు కొన్ని పాత్రలు దక్కని సందర్భాలు ఉన్నాయి. చిన్న స్టార్ల విషయంలో అయినా సరే, పెద్ద పెద్ద హీరోయిన్ల విషయంలోనైనా ఇది చాలా సార్లు జరిగింది. కొన్ని సార్లు ఫుల్ ఫామ్‌లో ఉన్న నటీనటులు కూడా ఓటమిని, తిరస్కరణనూ చవి చూడక తప్పదు. అవును మనకు తెలిసిన చాలా ఫేమస్ హీరోయిన్లు కూడా ఆడిషన్లలో సెలక్ట్ కాని సందర్భాలు చాలా ఉన్నాయి. ఆలియా భట్ నుంచీ సారా అలీ ఖాన్ వరకూ పెద్ద బ్యానర్ సినిమాలకు ఆడిషన్లు ఇచ్చి ఫేలయిన కొందరు నటీమణుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శ్రద్ధా కపూర్
హిందీ సినీ పరిశ్రమలో పేరు ప్రఖ్యాతలు కలిగిన డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ సినిమా కోసం శ్రద్ధా కపూర్ ఆడిషన్స్ ఇచ్చి రిజెక్ట్ అయ్యారట. అది చాలా మంచి సినిమా అని, అందులో సెలక్ట్ అవాలని అనుకున్నారట. కానీ ఆమె ఎంతగానో ప్రయత్నించి ఆఖరికి ఓడిపోయారట. ఇందుకు ఆమె మూడు రోజుల పాటు తన గదిలోనే కూర్చుని ఏడ్చారని తాజాగా ఫిల్మ్ ఫేర్ సమయంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రద్ధా కపూర్ చెప్పుకొచ్చారు.
కియారా అద్వానీ
'లాల్ సింగ్ చద్దా' సినిమాలో 'రూప' పాత్ర కోసం యంగ్ బ్యూటీ కియారా అద్వానీ ఆడిషన్ ఇచ్చారట. కానీ ఆ పాత్ర కోసం తర్వాత ఆడిషన్ ఇచ్చిన కరీనా కపూర్‌ను మేకర్స్ ఎంచుకున్నారట. వాస్తవానికి ఆడిషన్లో పాల్గొనడం కరీనాకు అదే మొదటిసారని సమాచారం.
సారా అలీ ఖాన్
సారా అలీ ఖాన్ కూడా 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' సినిమా కోసం ఆడిషన్ ఇచ్చి ఫెయిల్ అయ్యారట. ఆమె ఆడిషన్ ఇచ్చిన పాత్రను తర్వాత ఫాతిమా సనా షేక్ దక్కించుకున్నారు.