Actress Prema Devi Movie Shooting Snake Bite : ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన సోషియో ఫాంటసీ చిత్రం దేవి. అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం క్రియేట్ చేసింది. అయితే ఈ చిత్రం విడుదలై నేటికి 25 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన హీరోయిన్ ప్రేమ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు. షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నారు.
"ఆ రోజుల్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చాలా తక్కువగా వచ్చేవి. ఆ సమయంలో వచ్చిన ఈ దేవి చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అంత పెద్ద విజయం సాధించడానికి మెయిన్ రీజన్ కోడి రామకృష్ణ గారే. సీన్ బాగా వచ్చే వరకూ 50 టేక్‌లు అయినా తీస్తారు. డే అండ్ నైట్ సినిమా కోసం పని చేశాను. డైలాగ్‌లు కూడా బాగా ప్రాక్టీస్ చేయించేవారు. అయితే అప్పుడు. ఇలాంటి పాముల సినిమాలు ఎవరు చూస్తారని అంతా అనుకున్నాం. కానీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక నేనే సర్ప్రైజ్ అయ్యాను. చిత్రీకరణ సమయంలో ఒక వ్యక్తిని నిజంగానే పాము కాటేసింది. అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. దీంతో రెండు రోజుల పాటు షూటింగ్ కూడా ఆపేశాం. క్లైమాక్స్ కోసం మంచులో చాలా ఇబ్బందులు పడ్డాం" అని అన్నారు.