తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'పుష్ప' రేంజ్ సెట్ చేసిన లేడీ గెటప్- జాతర సీన్ వెనుక కథేంటంటే? - PUSHPA GANGAMMA JATARA

బన్నీ అమ్మవారి గెటప్​ ఆలోచన సుకుమార్​దేనట- జాతర సీక్వెన్స్ స్టోరీ ఏంటంటే?

Pushpa Gangamma Jatara
Pushpa Gangamma Jatara (Source : ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2024, 10:17 PM IST

Pushpa Gangamma Jatara :ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా కోసం యావత్ సినీ ప్రపంచం ఎదురుచూస్తోంది. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీటీమ్ ప్రమోషన్స్​లో బిజీగా ఉంది. అందులో భాగంగానే శుక్రవారం ముంబయిలో ప్రెస్​మీట్ నిర్వహించింది. ఈ మీట్​లో పాల్గొన్న హీరో అల్లు అర్జున్ సినిమాలోని గంగమ్మ జాతర ఎపిసోడ్​లో ఆయన గెటప్ గురించి మాట్లాడారు.

నిజానికి అమ్మవారి గెటప్​​ ఫొటో సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసింది. బన్నీని అలా అమ్మవారి గెటప్​​లో చూపించాలనన్నది పూర్తిగా సుకుమార్ ఆలోచనే అంట. దీని వెనకాల జరిగిన కథను బన్నీ తాజా ప్రెస్​మీట్​లో వివరించారు. 'ఈ ఒక్క ఫొటో పుష్ప 2 రేంజ్ పెంచేసింది. ఇది పూర్తిగా సుకుమార్ ఆలోచనే. ముందుగా పుష్ప క్యారెక్టర్​ను రిచ్ లుక్​లో చూపించాలని భావించాం. అందుకు తగ్గట్లుగా సూట్, సఫారీ ధరించి ఫొటోషూట్ చేశాం. ఔట్​పుట్ కూడా బాగా వచ్చింది. కానీ, సుకుమార్ మాత్రం సంతృప్తి చెందలేదు.

ఆయన ప్రేక్షకుల​కు కొత్తదనం ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. వెంటనే లేడీ గెటప్ వేయాలని నన్ను అడిగారు. అది విన్న నేను షాక్​ అయ్యాను. అప్పుడు ఆ గెటప్ గురించి తన విజన్ నాకు వివరించారు. నేనూ తనపై నమ్మకంతో ఓకే చెప్పేశాను. కానీ, ఆ మేకోవర్ కోసం చాలా కష్టపడ్డాం. తొలి రెండు రోజులు ఫొటోషూట్​ ఫెయిల్ అయ్యింది. అనుకున్న ఔట్​పుట్ రాలేదు. చివరగా మూడో రోజు అనుకున్న గెటప్​ సాధించాం. అప్పుడు నాకు అర్థమైంది సుకుమార్​కు ఏం కావాలో అని. అతను ఓ జీనియస్' అని బన్నీ లేడీ గెటప్ స్టోరీని వివరించారు.

కాగా, ఈ జాతర సీన్​పై మేకర్స్ ఎంతో కేరింగ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. జాతర ఎపిసోడ్ షూటింగ్‌లో దాదాపు 2000మంది జూనియర్లు, 200మంది డ్యాన్సర్లు పాల్గొన్నట్లు రీసెంట్​గా కొరియోగ్రాఫర్ విజయ్ చెప్పారు. ఈ సీక్వెన్స్ కోసం 30రోజులకు పైగానే పట్టిందట. స్పెషల్ మేకప్, లైటింగ్ సెటప్స్​, ఆర్ట్ వర్క్, మోకోబాట్ కెమెరాతో షూట్ చేసినట్లు తెలిసింది. ఓవరాల్​గా ఈ ఒక్క ఎపిసోడ్​కు రూ.50 నుంచి 60 కోట్ల దాకా ఖర్చైనట్లు సమాచారం.

యూఎస్​లో పుష్పగాడి రూల్​- వైల్డ్ ఫైర్​ దెబ్బకు 45 వేల ప్లస్ టికెట్స్ సేల్​!

'పుష్ప 2' తెలుగు ఈవెంట్ డేట్ ఫిక్స్​- స్పెషల్ గెస్ట్ సుక్కూనే!

ABOUT THE AUTHOR

...view details