OTT Horror Movie Poltergeist : సాధారణంగా హారర్ సినిమాల్లో దెయ్యాలు మనుషుల్ని వెంటాడి చంపడం చూస్తుంటాం. లేదంటి అలాంటి హారర్ సినిమాలు చూస్తునప్పుడు భయపడి చనిపోయిన ప్రేక్షకులను చూసుంటాం. కానీ ఓ హారర్ మూవీని తీసిన ఆరుగురు నటీనటులు ప్రొడక్షన్ సమయంలోనో లేదా సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే చనిపోవడం ఎప్పుడైనా విన్నారా? వాళ్లు నిజంగానే దెయ్యం శాపంతో చనిపోయారని చాలా మంది నమ్ముతున్నారు! అవును మీరు చదువుతున్నది నిజం.
అసలేజం జరిగిందంటే?1982లో హాలీవుడ్లో పోల్టర్‌గిస్ట్ అనే మూవీ వచ్చింది. ఆ మూవీ మేకర్స్, యాక్టర్స్‌కే ఈ అనూహ్య ఘటనలు ఎదురయ్యాయి! ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బెర్గ్, మైఖేల్ గ్రేస్, మార్క్ విక్టర్‌తో కలిసి పోల్టర్‌గిస్ట్ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. దీనికి టోబ్ హూపర్ దర్శకత్వ వహించారు. ఓ ఇంట్లో నివసిస్తున్న కుటుంబంపై దెయ్యాలు దాడి చేసి వాళ్ల కూతురిని ఎత్తుకుపోవడమే ఈ చిత్ర కథ. అయితే నిజజీవితంలో ఆ దెయ్యం శాపం వల్లే ఈ సినిమాలో నటించిన ఆరుగురు నటీనటులు మరణించారన్న వార్తలు బయటకు వచ్చాయి.
క్లైమాక్స్ వల్లే ఇలా? - ఈ పోల్టర్‌గిస్ట్ సినిమా క్లైమాక్స్‌లో తల్లి డయానా పాత్ర పోషించిన జోబెత్ విలియమ్స్ అస్థిపంజరాలు ఉన్న ఓ కొలనులోకి చెరువులోకి దూకుతుంది. అయితే అందులోని అస్థిపంజరాలు డూప్లికేట్ కావు. రియాలిటీ కోసం నిజ మనుషుల అస్థిపంజరాలనే ఉపయోగించారు. మరో విషయం ఏంటంటే ఆ కొలనులోకి దూకినప్పుడు జోబెత్కు అవి నిజమైన అస్థిపంజరాలని తెలీదట. చాలా కాలం తర్వాత తనకీ విషయం తెలిసిందని జోబెత్ చెప్పింది. అయితే నిజమైన అస్థిపంజరాలను ఉపయోగించడం, చనిపోయినవారిని అవమానించడమేనని, అందుకే అస్థిపంజరాల(దెయ్యాల) శాపం తగిలినట్లు పుకార్లు వచ్చాయి.
ఆరుగురి మరణం - పోల్టర్‌గైస్ట్ సినిమా తెరకెక్కిస్తున్న సమయంలో లేదా ఆ చిత్రం రిలీజ్ అయితే కొద్ది కాలానికే ఈ ఆరుగురిలో నలుగురు మరణించారు. మూవీలో పెద్ద కూతురిగా నటించిన డొమినిక్ డూన్ 1982 నవంబర్ లో తన బాయ్‌ఫ్రెండ్ చేతిలో హత్యకు గురైంది. అప్పుడు ఆమె వయసు 23. చిన్న కూతురుగా నటించిన హీథర్ ఓరూర్కీ 12 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో కన్నుమూసింది.