2024 Highest Collected Movies In India:2024 భారతీయ సినీ ఇండస్ట్రీకి అద్భుతమైన సంవత్సరం అనే చెప్పాలి. ఈ ఏడాదిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ సహా పలు భాషల్లో విడుదలైన వివిధ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకున్నాయి. ఈ క్రమంలో అనేక సినిమాలు వందలాది కోట్లు వసూళ్లు సాధించాయి. మరి ఈ లిస్ట్‌లో ఏయే సినిమాలు ఉన్నాయో చూద్దాం
ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ముఖ్యంగా తెలుగు సినిమాల హవా నడిచింది. దేశవ్యాప్తంగా టాలీవుడ్ కంప్లీట్ డామినేషన్ ప్రదర్శించింది. 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాల్లో నాలుగు టాలీవుడ్వే. అందులోనూ టాప్- 2 సినిమాలు తెలుగువే కావడం విశేషం.
పుష్ప రూలింగ్ :ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప 2' ఈ ఏడాది ఇండియన్ సినిమాను రూల్ చేసింది. డిసెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజైన ఈ సినిమా 21 రోజుల్లోనే ఏకంగా రూ. 1705 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఈ క్రమంలో 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా అగ్రస్థానంలో నిలిచింది.