తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

ఐటీఐతో హైదరాబాద్​లో జాబ్స్ - నెలకు రూ.30 వేల శాలరీ - టైమ్ తక్కువుంది త్వరపడండి! - MIDHANI RECRUITMENT 2024

మిథానిలో టెన్త్​, ఐటీఐ అర్హతతో జాబ్స్​ - ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 31 అసిస్టెంట్ పోస్టుల ఖాళీలకు భర్తీ

MIDHANI JOB NOTIFICATION 2024
Midhani Recruitment for Assistant post 2024 in Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 17, 2024, 2:27 PM IST

Midhani Recruitment for Assistant post 2024 in Hyderabad :టెన్త్​ పాసై, ఐటీఐ చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. నగరంలోని కంచన్‌బాగ్‌లో ప్రభుత్వ రంగ సంస్థ అయిన మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్​ (MIDHANI) ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ఖాళీల పోస్టులకు వాక్​ఇన్​ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఇంతకీ ఏయే పోస్టులు ఖాళీలు ఉన్నాయంటే

  • అసిస్టెంట్ (మెటలర్జీ): 13 పోస్టులు
  • అసిస్టెంట్ (మెకానికల్): 02 పోస్టులు
  • అసిస్టెంట్ (ఫిట్టర్): 09 పోస్టులు
  • అసిస్టెంట్ (వెల్డర్): 04 పోస్టులు
  • అసిస్టెంట్ (డ్రైవర్): 03 పోస్టులు

మొత్తం అన్నీ కలిపి పోస్టుల సంఖ్య 31 ఉన్నాయి.

అర్హత :పైన ఉన్న పోస్టును అనుసరించి టెన్త్​ క్లాస్​, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత, ఎల్‌ఎంవీ/ హెచ్‌ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్​తో పాటు పని అనుభవం కూడా ఉండాలి.

ఏయే పోస్టులకు జీతాలు ఎంతంటే?

  • అసిస్టెంట్ (మెటలర్జీ)/ అసిస్టెంట్ (మెకానికల్) పోస్టులకు నెలకు రూ.31,720,
  • అసిస్టెంట్ (డ్రైవర్) పోస్టులకు రూ.27,710.
  • ఇతర పోస్టులకు నెలకు రూ.28,960.

ఎంపిక ప్రక్రియ ఇలా : రాత పరీక్ష, ట్రేడ్/ ప్రొఫీషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వాక్-ఇన్ తేదీలు ఎప్పుడంటే :ఈ నెల 28, 29 : నవంబర్​ 25, 26, 27-2024

వేదిక : మిధాని కార్పొరేట్ ఆఫీస్ ఆడిటోరియం, కంచన్‌బాగ్, హైదరాబాద్

ముఖ్యాంశాలు

హైదరాబాద్​లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన అసిస్టెంట్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది.

విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా?, ఇదిగో సువర్ణవకాశం - రేపే లాస్ట్​డేట్

భారీ వేతనంతో ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్స్​​ - మీ చేతిలో డిగ్రీ ఉందా- ఐతే అప్లై చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details