US Consulate General Hiring Mason in Hyderabad: మీరు తాపీ పని చేస్తున్నారా? ఒకరోజు పని ఉంటే మరో రోజు పని ఉండటం లేదా..? తాపీ పనితో వచ్చే డబ్బులు సరిపోవట్లేదని ఫీలవుతున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. సంవత్సరానికి నాలుగున్నర లక్షల జీతంతో శాశ్వత ఉద్యోగం పొందే అవకాశం ఉంది. అది కూడా హైదరాబాద్‌లోనే! ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ చూసేయండి.
నానక్‌రామ్‌గూడలోని US కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో ఈ జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం.. US కాన్సులేట్ జనరల్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జాతి, రంగు, మతం, లింగం, నేషనాలిటీ, వయసు, వైవాహిక స్థితి, రాజకీయ అనుబంధం వంటి అంశాలతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం వెల్లడించింది.
నోటిఫికేషన్ వివరాలు..
- జాబ్‌రోల్ - తాపీమేస్త్రీ
- పోస్టుల సంఖ్య - 1
- జీతం - సంవత్సరానికి 4 లక్షల 47వేల 348 రూపాయలు, ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి..
- పని దినాలు- వారానికి 40 గంటలు
- జాబ్ లోకేషన్- హైదరాబాద్
- అప్లై చేయడానికి చివరి తేదీ- 25 ఫిబ్రవరి 2024
ప్రభుత్వ రంగ బీమా సంస్థ NIACLలో 300 అసిస్టెంట్ పోస్టులు - దరఖాస్తు చేయండిలా!
అర్హతలు:
- తాపీ పనిలో రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.
- అలాగే కాంక్రీటు గ్రేడ్‌లు, కాంక్రీటు వేయడం, ఇటుక పని, టెర్రాజో ఫ్లోరింగ్, మార్బుల్ ఫ్లోరింగ్, హాలో కాంక్రీట్ బ్లాక్స్ వాల్, సహజ రాయి వేయడం, కట్టింగ్ మొదలైన పనులు తెలిసి ఉండాలి. అలాగే వివిధ పనుల కోసం మెటీరియల్ అంచనా కూడా తెలిసి ఉండాలి.
- ఇక విద్య విషయానికి వస్తే.. కనీసం 8వ తరగతి కచ్చితంగా పూర్తి చేసి ఉండాలి.
- అలాగే.. ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో రాయడం, మాట్లాడటం, చదవడం వచ్చి ఉండాలి. వీటిపై టెస్ట్‌లు కూడా నిర్వహిస్తారు.
- న్యూమాటిక్ సుత్తులు, కాంక్రీట్ స్ప్రేయర్‌లతో పనిచేసే అనుభవం అవసరం. ఎటువంటి వాతావరణంలో అయినా పని చేయడానికి శారీరక సామర్థ్యం కలిగి ఉండాలి.
- ఈ పోస్టుకు అప్లై చేసే అభ్యర్థులు పబ్లిక్ ట్రస్ట్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- అలాగే.. అప్లై చేసేటప్పుడు పైన చెప్పిన విద్యాప్రమాణాలకు సంబంధించిన సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.
- దరఖాస్తులను పరిశీలించిన తర్వాత.. అర్హులైన వారిని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ వివరాలను అభ్యర్థుల మెయిల్‌కు పంపిస్తారు.
- ఇంటర్య్వూ సమయంలో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత సెలక్షన్ చేస్తారు.
- అదనపు వివరాల కోసం.. HyderabadVacancies@state.gov మెయిల్ ఐడీకి మెయిల్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.
దక్షిణ రైల్వేలో 2860 అప్రెంటీస్ పోస్టులు - అప్లై చేసుకోండిలా!
ఉపాధికి దిక్సూచి ఈ కోర్సులు- పూర్తి చేస్తే రూ.లక్షల్లో జీతాలు!