TS EAPCET (EAMCET) 2024 Counselling Updates :తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్‌లో ప్రవేశం పొందేందుకు ఎప్‌సెట్(ఎంసెట్) తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 4 (గురువారం) నుంచి స్టార్ట్ అయింది. మొత్తం మూడు విడతల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. దీని ద్వారా ఇంజినీరింగ్‌తోపాటు ఎంపీసీ నుంచి ఫార్మసీ కోర్సులకు వెళ్లే వారికి సీట్ల కేటాయించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఎప్‌సెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులు ముందుగానే తమ వద్ద ఈ ధ్రువపత్రాలు ఉన్నాయో లేదో ఓసారి చెక్ చేసుకోవాలి. లేదంటే.. కౌన్సెలింగ్ టైమ్‌లో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది! ఇంతకీ, టీఎస్ ఎప్‌సెట్(EAPCET 2024) కౌన్సెలింగ్‌లో పాల్గొనే వారికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టీఎస్ ఎప్‌సెట్ వెబ్‌కౌన్సెలింగ్‌లో భాగంగా నిర్వహించే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అవసరమైన డాక్యుమెంట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒరిజినటల్ సర్టిఫికేట్లతోపాటు రెండు జతల జిరాక్స్ కాపీలు అభ్యర్థులు తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు ఇప్పుడు చెప్పబోయే సర్టిఫికేట్లు వారి వద్ద కలిగి ఉండాలి. అవేంటంటే..
- పదో తరగతి మార్కుల మెమో
- ఇంటర్ మార్కుల మెమో
- ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్(TC)
- స్టడీ సర్టిఫికెట్లు(6 నుంచి ఇంటర్ వరకు తప్పనిసరిగా ఉండాలి)
- లేటెస్ట్ ఇన్‌కం సర్టిఫికెట్(అంటే.. 01-01-2024 తర్వాత జారీ అయి ఉండాలి)
- క్యాస్ట్ సర్టిఫికేట్
- ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్(అంటే.. మీకు EWS రిజర్వేషన్ అర్హత ఉంటే స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ నుంచి సర్టిఫికెట్ తీసుకోవాలి)
- ఆధార్ కార్డు
- టీఎస్ ఈఏపీసెట్(ఎంసెట్) - 2024 హాల్‌టికెట్
- టీఎస్ ఈఏపీసెట్(ఎంసెట్) - 2024 ర్యాంక్ కార్డు(ఒకవేళ.. మీ వద్ద ర్యాంక్ కార్డు లేకపోతే https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోండి)
- పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు
పైన చెప్పిన సర్టిఫికెట్లను ఎప్‌సెట్ 2024 కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులు ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం మంచిది.
స్టడీ గ్యాప్ వచ్చినవారు - ఎంసెట్, నీట్ వంటి పరీక్షలు రాయొచ్చా?