Tips While Book Reading : సాధారణంగా చాలా మందికి పుస్తకం పట్టుకుని చదవడం స్టార్ట్ చేయగానే నిద్ర వచ్చేస్తుంది. మరికొందరికి వేరే అంశంపైకి దృష్టి మళ్లుతుంది. ఇక స్మార్ట్ ఫోన్ చేతిలోకి వస్తే అంతే సంగతి. అయితే అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే ఎదురయ్యే ఆటంకాల్ని అధిగమించి చాలా శ్రమించాలి. కేవలం మార్కులనే కాదు, పుస్తక జ్ఞానం కావాలన్నా శ్రద్ధగా చదవాలి. అందుకోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం.
- మీరు చదివినప్పుడు చుట్టూ నిశ్శబ్ధ వాతావరణం ఉండేలా చూసుకోండి.
- మీరు చదివే ప్రదేశాన్ని మంచి వెలుతురుతో సౌకర్యంగా ఉండేలా తీర్చిదిద్దుకోండి.
- ప్రతిసారీ లేచేందుకు వీల్లేకుండా తాగునీరు దగ్గర పెట్టుకోండి.
- మీకు అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉంచుకోండి.
- మధ్య మధ్యలో లేస్తూ చిన్న విరామాలు తీసుకోండి.
- ఐదు నిమిషాల పాటు విరామం తీసుకోంటే మంచిది.
- ఏ పుస్తకం చదవాలనుకుంటున్నారో ముందే నిర్దేశించుకోండి.
- ఎప్పుటిలోగా పూర్తి చేయాలో టార్గెట్ కూడా పెట్టుకోండి.
- అనుకున్నదాన్ని పూర్తి చేశారో లేదే చూసుకోండి.
- పెద్ద పెద్ద పుస్తకాలు చదివేటప్పుడు మధ్య మధ్యలో నీరు తాగుతూ ఉండండి.
- శక్తిని కోల్పోకుండా ఉండేందుకు ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను ఎంచుకోండి.
ఇది స్మార్ట్‌ఫోన్‌ల యుగం. కాబట్టి ఫోన్ లేకుండా ఉండటం కష్టమే. కానీ, ఫోన్‌లో వచ్చే నోటిఫికేషన్లు, సామాజిక మాధ్యమాలు మీ ఫోకస్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది. అందుకే లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తున్నప్పుడు ఇలాంటి వాటిని నియంత్రించుకోవడం చాలా అవసరం. ఒకసారి ఒక పనిపైనే దృష్టిస్తూ మీ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోండి.
మరోవైపు, చాలా మంది విద్యార్థులు అందరి మధ్యలో ఉన్నప్పుడు చాలా బాగా మాట్లాడుతారు. తమ స్కిల్స్, వాక్చాతుర్యంతో ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు. కానీ స్టేజ్ ఎక్కి నలుగురి ముందు మాట్లాడమంటే మాత్రం వాళ్ల సౌండ్ బాక్స్ మ్యూట్ అవుతుంది. ఆ భయాన్ని ఎంత వదిలించుకుందామన్నా అది మాత్రం పోదు. కానీ ఏదో ఒక సమయంలో నలుగురి ముందుకు వెళ్లి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో చాలా మందికి స్టేజ్ ఎక్కేసరికి కాళ్లు, చేతులు వణికిపోతాయి. ఒళ్లంతా చల్లడి మాట్లాడాలనుకున్నప్పుడు తడబడతారు. మంచి నాలెడ్జి ఉంటుంది. కానీ స్టేజి ఫియర్ వలన దానిని వ్యక్తపరచలేరు. దీని వల్ల గొప్ప అవకాశాలను కూడా కోల్పేయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే పుట్టుకతోనే ఎవరూ కూడా గొప్ప ఉపన్యాసకులుగా పుట్టరు. వాళ్లని వాళ్లు గొప్ప వక్తలుగా మలుచుకుంటారు. మొదట్లో ప్రతి ఒక్కరికి ఆ భయం ఉంటుంది. ఆ భయాన్ని అధిగమించాలి. మరి అలా చేయాలంటే ఈ టిప్స్ పాటించమని సలహా ఇస్తున్నారు నిపుణులు. అవేంటో తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.