తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

ఇట్స్​ ఎగ్జామ్స్​ టైమ్​ - ఈ టిప్స్​ పాటిస్తే పిల్లలు మస్త్​ హుషార్​! - TIPS TO AVOID STRESS IN STUDENTS

-మార్చి 5 నుంచి ఇంటర్, 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం -సరైన ప్రణాళికతో ఆందోళన మటుమాయం అంటున్న నిపుణులు

Tips to Avoid Stress in Students During Exams
Tips to Avoid Stress in Students During Exams (Getty Images)

By ETV Bharat Telangana Team

Published : Feb 16, 2025, 12:05 PM IST

Tips to Avoid Stress in Students During Exams:ఫిబ్రవరి నుంచి మే వరకు పిల్లలకు పరీక్షా కాలం. సాధారణంగా ఎగ్జామ్స్​ అంటేనే చాలా మంది పిల్లలు భయపడుతుంటారు. తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటున్నప్పటికీ పరీక్షలంటే ఉన్న భయం పోదు. చదివింది గుర్తుండటం లేదని, పరీక్షలు రాసే సమయానికిఎలాంటి ఇబ్బంది ఉంటుందోనని ఆందోళన చెందుతుంటారు. ఈ క్రమంలోనే పరీక్షల వేళ పిల్లలు అటు పెద్దలు పరేషాన్​ కాకుండా ఉండేందుకు ఈ టిప్స్​ మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

ఇప్పటికే సీబీఎస్ఈ, ఐసీఎస్‌ఈ బోర్డు ఎగ్జామ్స్​ ప్రారంభమయ్యాయి. మరికొద్ది రోజుల్లో స్టేట్‌ టెన్త్, ఇంటర్‌ పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో చదివింది గుర్తుపెట్టుకోవడం, ఆరోగ్యం కాపాడుకోవడం చాలా కీలకం. ఏదిపడితే అది తింటే పరీక్షల వేళ అది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే నిద్ర లేకుండా పుస్తకాలతో కుస్తీ పట్టడం సరికాదని సూచిస్తున్నారు.

నిద్రపోకుండా చదవడం సరికాదు: ఎగ్జామ్స్​​ అంటే చాలా మంది విద్యార్థులు తిండి, నిద్ర మానేసి టైమ్​తో పనిలేకుండా చదువుతుంటారు. ఎంత ఎక్కువ చదివితే అన్ని మంచి మార్కులు వస్తాయనే భావనలో ఉంటారు. అయితే ఇలా తిండి, నిద్ర మానేసి చదవడం మంచిది కాదని ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో సైకియాట్రిస్టు డాక్టర్‌ అనిత అంటున్నారు.

  • టైం టేబుల్‌ పెట్టుకొని ప్రతి సబ్జెక్టు కొంత సమయం చదువుకుంటూ పోవాలని, ఏకధాటిగా పుస్తకాలతో కుస్తీ పట్టకుండా మధ్య మధ్యలో కాస్తంత విశ్రాంతి తీసుకోవడం అవసరమంటున్నారు.
  • రాత్రి మొత్తం చదవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, చదివింది మెదడుకు ఎక్కదని, ఫలితంగా అనవసర ఆందోళనకు కారణమవుతుందని అంటున్నారు. కాబట్టి రోజూ కనీసం 7-8 గంటలపాటు నిద్ర తప్పనిసరని సూచిస్తున్నారు.
  • ఎంత ప్రణాళిక వేసుకున్నా సరే కొందరికి పరీక్షలంటే భయం. ఇలాంటి వారితో పెద్దలు అప్రమత్తంగా ఉంటూ అవసరమైతే నిపుణులతో కౌన్సిలింగ్‌ ఇప్పించాలని సూచిస్తున్నారు.

ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు:ఎగ్జామ్స్​ టైమ్​లో చాలా మంది ఫుడ్​ విషయంలో అజాగ్రత్తగా ఉంటారు. చదువులో పడి ఆయిల్​, జంక్​ ఫుడ్స్​ను విపరీతంగా తీసుకుంటారు. అయితే పరీక్షల సమయంలో పిల్లలకు ఇచ్చే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని జాతీయ పోషకాహార సంస్థ మాజీ శాస్త్రవేత్త డాక్టర్‌ లక్ష్మయ్య అంటున్నారు.

  • పరీక్షల సమయంలో పిల్లలకు ఎక్కువగా ఆయిల్‌ ఫుడ్స్, డీప్‌ ఫ్రైడ్‌ ఆహారం ఇవ్వకూడదని, బయట నుంచి ఆహారం పూర్తిగా తగ్గించాలని సూచిస్తున్నారు.
  • పిల్లలకు బ్రేక్​ఫాస్ట్​ తప్పకుండా ఇవ్వాలి. చిరు ధాన్యాలతో చేసిన పోహా, రాగి దోశ, ఇడ్లీ, ఓట్స్, పండ్ల ముక్కలు, గుడ్డు, పాలు అందించాలని సలహా ఇస్తున్నారు.
  • నిద్ర రాకుండా రాత్రిళ్లు కాఫీలు, టీలు ఎక్కువ తాగడం వల్ల గ్యాస్ట్రిక్‌ సమస్యలకు దారి తీయొచ్చు కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
  • ఎగ్జామ్స్​ టైమ్​లో ఎండలు పెరగడంతో శరీరం డీహైడ్రేషన్‌కు గురై తలనొప్పి, నీరసం, వాంతులు వాటితో పరీక్షలు సక్రమంగా రాయలేరు. కాబట్టి రోజూ తప్పనిసరిగా 7-8 గ్లాసుల నీళ్లు తాగేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

పదో తరగతి విద్యార్థులు కాస్త శ్రద్ధ పెడితే చాలు - ఆ సబ్జెక్ట్​లో మంచి మార్కులు మీ సొంతం!

పిల్లల పరీక్షల వేళ మారాల్సింది తల్లిదండ్రులే!

ABOUT THE AUTHOR

...view details