తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Mar 14, 2024, 7:19 PM IST

Updated : Mar 14, 2024, 9:37 PM IST

ETV Bharat / education-and-career

టీఎస్​ టెట్​ నోటిఫికేషన్​, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల - జులై 17 నుంచి డీఎస్సీ ఎగ్జామ్స్​

TS TET 2024 Notification Release : టీఎస్​ టెట్​-2024 నోటిఫికేషన్​ విడుదలైంది. మే 20 నుంచి జూన్​ 3 వరకు టెట్​ పరీక్షలు నిర్వహించనున్నారు. మరోవైపు డీఎస్సీ పరీక్ష షెడ్యూల్​ను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. జులై 17 నుంచి 31 వరకు డీఎస్సీ ఎగ్జామ్స్​ జరగనున్నాయి.

Telangana Govt Approves TS TET
Telangana Govt Approves TS TET

TS TET 2024 Notification Release :టెట్​-2024 నోటిఫికేషన్​ విడుదలైంది. మే 20 నుంచి జూన్​ 3 వరకు టెట్​ పరీక్షలు నిర్వహిస్తున్న పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈనెల 27 నుంచి ఆన్​లైన్​లో టెట్​ దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏప్రిల్​ 10 వరకు టెట్​కు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు డీఎస్సీ పరీక్షల తేదీలను కూడా విద్యాశాఖ ప్రకటించింది. జులై 17 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

Telangana Govt Approves TS TET :మెగా డీఎస్సీ (Mega DSC 2024)కి ముందే టెట్​ నిర్వహించేందుకు సర్కారు పచ్చజెండా ఊపింది. గత నెల 29న రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 11062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ నెల 4 నుంచి అర్హత గల అభ్యర్థుల నుంచి ఆన్​లైన్​ దరఖాస్తులను సైతం స్వీకరిస్తోంది. అయితే డీఎస్సీ రాయాలంటే ముందుగా టెట్​ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో ఇటీవల బీఎడ్​, డీఎడ్​ పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి డీఎస్సీకి ముందే టెట్(TS TET 2024)​ నిర్వహించాలన్న అభ్యర్థనలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన సర్కారు డీఎస్సీకి ముందే వీలైనంత త్వరగా టెట్​ నిర్వహించాలంటూ పాఠశాల విద్యా కమిషనర్​కి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో దాదాపు మూడు లక్షల మంది అభ్యర్థులకు ఊరట లభించనుందని అంచనా. త్వరలోనే టెట్​ నోటిఫికేషన్​ను ఉన్నత విద్యాశాఖ జారీ చేయనుంది. ఇప్పటికే డీఎస్సీ నోటిఫికేషన్​ జారీ, దరఖాస్తు స్వీకరణ జరిగింది.

తెలంగాణలో మెగా, ఆంధ్రాలో దగా డీఎస్సీ - జగన్నాటకంలో ఆవిరైపోయిన టీచర్ పోస్టులు

Telangana DSC Notification 2024 : తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ (TS DSC Notification 2024) జారీకి రంగం సిద్ధమైంది. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు విడుదల చేయనున్నారు. వాటిలో స్కూల్‌ అసిస్టెంట్‌ 2629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులున్నాయి. దరఖాస్తుల గడువు నియమ నిబంధనలను వెల్లడించనున్నారు. గతేడాది విడుదలైన డీఎస్సీ ప్రకటనను రద్దు చేస్తూ కాంగ్రెస్​ ప్రభుత్వం కొత్త షెడ్యూల్​ను విడుదల చేసింది.

రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్​ విడుదల - పోస్టుల వివరాలు ఇవే

11 వేలకు పైగా పోస్టులతో నేడే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ - మే లేదా జూన్​లో ఎగ్జామ్స్

Last Updated : Mar 14, 2024, 9:37 PM IST

ABOUT THE AUTHOR

...view details