Study Tips For Exams Preparation : కొందరు విద్యార్థులు పరీక్షలు ఎంత బాగా రాసినా మార్కులు మాత్రం ఊహించిన దాని కంటే తక్కువే వస్తున్నాయి. సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా చదివినా ఫలితం దక్కడంలేదని వాపోతుంటారు. మరి, ముఖ్యంగా పరీక్షల టైమ్లో చాలా మంది విద్యార్థులు సరిగా ఆహారం తీసుకోరు, తగినంత నిద్ర పోరు. అలాగే ఒత్తిడి, ఆందోళనల కారణంగా వివిధ ఆరోగ్య సమస్యల బారినపడుతుంటారు. అలాంటి జాబితాలో మీరూ ఉన్నారా? అయితే, ఈ టిప్స్ పాటించారంటే.. ఇకపై మీరు ఆరోగ్య సమస్యల బారినపడకుండా ఉండడమే కాదు..పరీక్షల్లో(Exams)మంచి మార్కులు సాధిస్తారంటున్నారు ప్రముఖ మానసిక నిపుణురాలు డాక్టర్ స్వాతి పైడిపాటి. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- ఎవరైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని, అంకితభావంతో చదివితే మంచి మార్కులు తప్పక వస్తాయంటున్నారు డాక్టర్ స్వాతి పైడిపాటి. అంతేకానీ.. ఎక్కువ మార్కులు రావాలని తిండి, నిద్ర మానేయడం మంచి పని కాదంటున్నారు.
- అలాగే.. ‘స్మార్ట్ వర్క్’ చేయాలి. వారానికి, నెలకి ఇన్ని ఛాప్టర్లు చదవాలి అని పెట్టుకుని చదివితే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. అంతేకానీ.. ఏకధాటిగా చదువుతూ పోతే ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు. అదేవిధంగా.. ఎన్ని గంటలపాటు చదివారు అనే దానికంటే ఎంత ఏకాగ్రతతో చదివారనేదే ముఖ్యమంటున్నారు.
- మీకు పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే.. ముందుగా ఏ సబ్జెక్టు లేదా పాఠంలో మార్కులు తగ్గుతున్నాయో చెక్ చేసుకోవాలి. వాటిని మిగతా వాటికంటే రెండు మూడుసార్లు ఎక్కువగా చదువుకోవాలంటున్నారు.