తెలంగాణ

telangana

6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ - SBI ఫ్రీ స్కాలర్​షిప్​! - ఇలా దరఖాస్తు చేసుకోండి - SBIF Asha Scholarship Program 2024

By ETV Bharat Telugu Team

Published : 14 hours ago

Asha Scholarship Program: విద్యార్థులకు గుడ్​న్యూస్​. 6 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేందుకు స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ఫౌండేషన్​ ముందుకొచ్చింది. ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్కాలర్​షిప్​లు అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Asha Scholarship Program
Asha Scholarship Program (ETV Bharat)

SBIF Asha Scholarship Program 2024: ప్రతిభ ఉన్నా.. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక చాలామంది చదువు మధ్యలోనే ఆపేస్తుంటారు. ఉన్నత చదువులు చదివి.. గొప్ప స్థితిలో ఉండాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ పేదరికం వారికి అడ్డుపడుతుంటుంది. అయితే.. ప్రతిభగల పేద విద్యార్థులకు చేయూతనందించి, వారి విద్యను ప్రోత్సహించేందుకు ఆశా స్కాలర్​షిప్​ ప్రోగ్రామ్​ 3వ ఎడిషన్​ని ఎస్​బీఐ ఫౌండేషన్​ లాంచ్​ చేసింది. దేశవ్యాప్తంగా వెనకపడిన వర్గాలకు చెందిన టాలెంటెడ్​ స్టూడెంట్స్​కి సాయం చేసేందుకు రూపొందించినదే ఈ ప్రోగ్రామ్​. ఈ నేపథ్యంలో 6 తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులు ఈ స్కాలర్​షిప్​కు ఎలా అప్లై చేసుకోవాలి? అర్హతలేంటి? కావాల్సిన డాక్యుమెంట్లు? లాస్ట్​ డేట్​ ఎప్పుడు? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

6 నుంచి 12 తరగతి విద్యార్థులు అప్లై చేసుకునే విధానం:

అర్హత:

  • కేవలం భారతీయులు మాత్రమే అప్లై చేసుకోవాలి.
  • అప్లై చేసుకునే వారు ప్రస్తుత విద్యా సంవత్సరం(2024-25)లో క్లాస్​ 6 నుంచి క్లాస్​ 12 మధ్యలో ఉండాలి.
  • గత అకడమిక్​ ఇయర్​లో కనీసం 75శాతం మార్కులు వచ్చి ఉండాలి.
  • స్థూల వార్షిక కుటుంబ ఆదాయం రూ. 3లక్షలు దాటకూడదు.
  • ఇందులో 50శాతం స్లాట్​లు ఫీమేల్స్​కు కేటాయిస్తారు.
  • ఎస్​ఎస్​, ఎస్​టీ అప్లికేషన్లకు ప్రిఫరెన్స్​ ఉంటుంది.
  • ఎంపికైన ప్రతి విద్యార్థికి రూ. 15వేల స్కాలర్​షిప్ లభిస్తుంది.

స్టూడెంట్స్​కు రూ.6 లక్షలు సాయం- రిలయన్స్ స్కాలర్‌షిప్​కు అప్లై చేసుకోండిలా!

కావాల్సిన డాక్యుమెంట్లు:

  • గత అకడమిక్​ ఇయర్​ మార్క్​షీట్​
  • గవర్నమెంట్​ ఐడీ ప్రూఫ్​ (ఆధార్​)
  • ప్రస్తుత ఏడాది ఎడ్యుకేషన్​ ఫీజ్​ రిసిప్ట్​
  • ప్రస్తుతం అడ్మిషన్​ ప్రూఫ్​
  • బ్యాంకు అకౌంట్​ వివరాలు(పిల్లలకు లేకపోతే తల్లిదండ్రులది)
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • పాస్​ఫొటో
  • కుల ధ్రువీకరణ పత్రం (కావాల్సివస్తే)

ఎలా అప్లై చేసుకోవాలి? :

  • ముందుగా sbifashascholarship.org అధికారిక వెబ్​సైట్​ ఓపెన్​ చేయండి.
  • Scholarships కాలమ్​లో SBIF Asha Scholarship Program for School Studentపై క్లిక్​ చేయండి.
  • అందులో Apply Now ఆప్షన్​పై క్లిక్​ చేయండి. వేరే పేజీ ఓపెన్​ అవుతుంది.
  • అక్కడ మీ వివరాలతో లాగిన్​ అవ్వాలి. మీరు ముందుగానే ఈ స్కాలర్​షిప్​ ప్రోగ్రామ్​కు అప్లై చేసుకుంటే ఆ వివరాలతో లాగిన్​ అవ్వాలి. లేదంటే Register ఆప్షన్​పై క్లిక్​ చేసి అక్కడ అడిగిన వివరాలు ఎంటర్​ చేసి Registration పూర్తి చేయాలి. ఆ తర్వాత ఆ వివరాలతో Buddy4Study లో లాగిన్​ అవ్వాలి.
  • ఆ తర్వాత SBIF Asha Scholarship Program 2024 అప్లికేషన్​ ఫామ్​ని పూర్తి చేయండి. అవసరమైన డాక్యుమెంట్స్​ని అప్​లోడ్​ చేయండి.
  • ప్రివ్యూ చేసి సబ్​మీట్​ చేయండి.

సెలక్షన్​ ప్రక్రియ:- అకడమిక్​ పర్ఫార్మెన్స్​, ఆర్థిక అవసరాలు, మెరిట్​ ఆధారంగా ఎస్​బీఐ ఆశా స్కాలర్​షిప్​ 2024 సెలక్షన్​ ప్రక్రియ ఉంటుంది. షార్ట్​లిస్ట్​ అయిన అభ్యర్థులకు టెలిఫోనిక్​ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్​ వెరిఫికేషన్​ ఉంటుంది. వీటిల్లో ఎంపికైతే బ్యాంక్​ ఖాతాలోకి స్కాలర్​షిప్​ డబ్బులు జమ అవుతాయి.

చివరి తేదీ:ఆసక్తిగల విద్యార్థులు అక్టోబర్​ 1లోపు అప్లికేషన్​ ఫిల్​ చేయాల్సి ఉంటుంది. ఇది సంవత్సరానికి ఒక్కసారి అందించే స్కాలర్​షిప్​ ప్రోగ్రామ్​.

'పది' పాసైన వారికి గుడ్​న్యూస్​ - రూ.వేలల్లో స్కాలర్​షిప్​ - దరఖాస్తులు తీసుకుంటున్నారు​!

ఇంటర్ పాసైతే ఏడాదికి రూ. 1.5 లక్షల స్కాలర్‌షిప్- ఎవరు అర్హులు? ఎలా అప్లై చేయాలి?

ABOUT THE AUTHOR

...view details