SBI SCO Recruitment 2024 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ క్యాడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి? పోస్టుల సంఖ్య, అప్లికేషన్ ఫీజు, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ, అర్హత తదితర వివరాలు మీ కోసం.
- ఉద్యోగాలు భర్తీ చేసే సంస్థ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- మొత్తం ఉద్యోగాల సంఖ్య : 131
- మేనేజర్(క్రెడిట్ అనాలసిస్) : 50
- అసిస్టెంట్ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్) : 23
- డిప్యూటీ మేనేజర్(సెక్యూరిటీ అనలిస్ట్) : 51
- మేనేజర్(సెక్యూరిటీ అనలిస్ట్) : 3
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (అప్లికేషన్ సెక్యూరిటీ) : 3
- సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వయిజర్ : 1
SBI SCO Eligibility 2024
అర్హత :మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ(ఫైనాన్స్)/పీజీడీబీఏ/పీజీడీబీఎం/ఎంఏఎస్(ఫైనాన్స్)/CA/సీఎఫ్ఏ/ఐసీడబ్ల్యూఏ వీటిలో ఏదో ఒక దానిలో డిగ్రీ పొంది ఉండాలి. దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులు ఇతర అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలకు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
SBI SCO FEE
ఫీజు : జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు ఫీజు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తులు స్వీకరణ తేదీ :ఆన్లైన్ అప్లికేషన్లను 2024 ఫిబ్రవరి 13 నుంచి స్వీకరిస్తారు.