తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

గుడ్‌ న్యూస్‌ - ఎస్‌బీఐ SO దరఖాస్తు గడువు పెంపు - చివరి తేదీ ఎప్పుడంటే? - SBI SO Recruitment 2024

SBI SO Recruitment 2024 : ఎస్‌బీఐ 1511 స్పెషలిస్ట్ ఆఫీసర్‌ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీని దరఖాస్తు గడువును మరో 10 రోజులు పెంచింది.

SBI
SBI (ANI)

By ETV Bharat Telugu Team

Published : Oct 5, 2024, 1:03 PM IST

SBI SO Recruitment 2024 :దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్ - రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్ ద్వారా 1,511 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుకు చివరి గడవు అక్టోబర్‌ 4తో ముగిసింది. కానీ వివిధ కారణాలతో ఇప్పటికీ అప్లై చేయలేకపోయిన వారికి మరో అవకాశం కల్పిస్తూ, దరఖాస్తు గడువును అక్టోబర్‌ 14 వరకు పెంచింది.

పోస్టుల వివరాలు

  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) - ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అండ్‌ డెలివరీ - 187 పోస్టులు
  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) - ఇన్‌ఫ్రా సపోర్ట్ అండ్‌ క్లౌడ్ ఆపరేషన్స్ - 412 పోస్టులు
  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) - నెట్‌వర్కింగ్ ఆపరేషన్స్‌ - 80 పోస్టులు
  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) - ఐటీ ఆర్కిటెక్ట్ - 27 పోస్టులు
  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) - ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ - 07 పోస్టులు
  • అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్) - 798 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 1,511

విద్యార్హతలు :పోస్టును అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి : 2024 జూన్‌ 30 నాటికి డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 25 నుంచి 35 ఏళ్లు; అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య అభ్యర్థుల వయస్సు ఉండాలి.

దరఖాస్తు రుసుము : జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.750 చెల్లించాలి. దివ్యాంగులకు, ఎస్టీ, ఎస్సీలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

పే స్కేల్ : డిప్యూటీ మేనేజర్‌లకు నెలకు రూ.64,820 - రూ.93,960 జీతం ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్‌లకు నెలకు రూ.48,480 - రూ.85,920 సాలరీ ఉంటుంది.

పోస్టింగ్ స్థలం :హైదరాబాద్‌/ నవీ ముంబయి

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తులు ప్రారంభం : 2024 సెప్టెంబర్‌ 14
  • దరఖాస్తుకు చివరి తేదీ : 2024 అక్టోబర్‌ 14

ABOUT THE AUTHOR

...view details