తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

ఇంజినీరింగ్ అర్హతతో SAILలో 249 ఉద్యోగాలు - లక్షల్లో జీతం - అప్లై చేసుకోండిలా! - SAIL Recruitment 2024

SAIL Recruitment 2024 : ఇంజినీరింగ్ చేసి ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) 249 మేనేజ్​మెంట్ ట్రైనీ (టెక్నికల్​) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన వారికి లక్షల్లో జీతం ఉంటుంది. పూర్తి వివరాలు మీ కోసం.

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 10:54 AM IST

SAIL Recruitment through GATE 2024
SAIL MT Recruitment 2024 (ANI)

SAIL Recruitment 2024 : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ 'స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా' (SAIL) 249 మేనేజ్​మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్ స్టీల్ ప్లాంట్లు, యూనిట్లు, గనుల్లో పని చేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగాల వివరాలు

  • కెమికల్ ఇంజినీరింగ్​ - 10 పోస్టులు
  • సివిల్ ఇంజినీరింగ్ - 21 పోస్టులు
  • కంప్యూటర్ ఇంజినీరింగ్ - 9 పోస్టులు
  • ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్​ - 61 పోస్టులు
  • ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ - 5 పోస్టులు
  • ఇన్​స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్​​ - 11 పోస్టులు
  • మెకానికల్ ఇంజినీరింగ్ - 69 పోస్టులు
  • మెటలర్జీ ఇంజినీరింగ్ - 63 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 249

విద్యార్హతలు
SAIL Management Trainee Qualifications :కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీనితోపాటు గేట్​-2024 స్కోర్ తప్పనిసరి.

వయోపరిమితి
SAIL Management Trainee Age Limit :అభ్యర్థుల వయస్సు 2024 జులై 25 నాటికి 28 ఏళ్లు మించి ఉండకూడదు. అయితే ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు, ఎస్టీ, ఎస్సీలకు 5 ఏళ్లు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము
SAIL Management Trainee Application Fee :

  • జనరల్​, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.700 చెల్లించాలి.
  • దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక ప్రక్రియ
SAIL Management Trainee Selection Process :గేట్​-2024 స్కోర్​, గ్రూప్​ డిస్కషన్​, ఇంటర్వ్యూల ఆధారంగా మెరిట్ సాధించిన అభ్యర్థులను మేనేజ్​మెంట్ ట్రైనీ పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు
SAIL Management Trainee Salary :మేనేజ్​మెంట్ ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.60,000 నుంచి రూ.1,80,000 వరకు జీతం ఇస్తారు.

దరఖాస్తు విధానం
SAIL Jobs Application Process :

  • అభ్యర్థులు ముందుగా సెయిల్​ అధికారిక వెబ్​సైట్​ https://www.sail.co.in/ ఓపెన్ చేయాలి.
  • మీరు కొత్త యూజర్ అయితే వన్​ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకోవాలి.
  • అప్పుడు మీకు ఒక యూజర్ ఐడీ, పాస్​వర్డ్ క్రియేట్ అవుతుంది.
  • ఈ యూజర్ ఐడీ, పాస్​వర్డ్​లతో వెబ్​సైట్​లోకి లాగిన్ అవ్వాలి.
  • అప్లికేషన్ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి.
  • అప్లికేషన్​ ఫీజు కూడా ఆన్​లైన్​లోనే చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని అప్లికేషన్​ను సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్​ రిఫరెన్స్​ కోసం అప్లికేషన్​ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్​లైన్ దరఖాస్తులు ప్రారంభం : 2024 జులై 5
  • ఆన్​లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 జులై 25

డిగ్రీ అర్హతతో - PNBలో 2700 పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా! - PNB Apprentice Recruitment 2024

నిరుద్యోగులకు గుడ్ న్యూస్​ - 6128 పోస్టులతో IBPS భారీ నోటిఫికేషన్​ - అప్లై చేసుకోండిలా! - IBPS Clerk Recruitment 2024

ABOUT THE AUTHOR

...view details