RRC WR Apprentice Recruitment 2024 : రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. 5,066 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి మహారాష్ట్రలోని ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే వెస్ట్రన్ రైల్వే ప్రకటన విడుదల చేసింది. ఎంపికయ్యే వారికి దీని పరిధిలోని రైల్వే డివిజన్లు, వర్క్‌షాపులలో అప్రెంటీస్ అవకాశం కల్పిస్తారు. మరి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హతలేంటి? ఆఖరి తేదీ ఎప్పుడు? ఫీజు ఎంత? తదితర విషయాలు తెలుసుకుందాం పదండి.
డివిజన్/ వర్క్‌షాప్‌లు :
బీసీటీ డివిజన్, బీఆర్‌సీ డివిజన్, ఏడీఐ డివిజన్, ఆర్‌టీఎం డివిజన్, ఆర్‌జేటీ డివిజన్, బీవీపీ డివిజన్, పీఎల్ వర్క్‌షాప్, ఎంఎక్స్ వర్క్‌షాప్, బీవీపీ వర్క్‌షాప్, డీహెచ్‌డీ వర్క్‌షాప్, పీఆర్‌టీఎన్ వర్క్‌షాప్, ఎస్‌బీఐ ఇంజినీరింగ్ వర్క్‌షాప్, ఎస్‌బీఐ సిగ్నల్ వర్క్‌షాప్, హెడ్ క్వార్టర్ ఆఫీస్ వంటి డివిజన్లలోని అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేస్తారు.
విద్యార్హత : పదో తరగతితో పాటు, సంబంధిత ట్రేడులో ఐటీఐ పాసవ్వాలి. ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్, పీఎస్‌ఏఏ, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వైర్‌మ్యాన్, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ, పైప్ ఫిట్టర్, ప్లంబర్, డ్రాఫ్ట్స్ మ్యాన్, స్టెనోగ్రాఫర్, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్ వంటి ఐటీఐ ట్రేడ్‌ల్లో ఉత్తీర్ణుతులైనవారు ఈ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.