RRB Paramedical Recruitment 2024 : రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో పారా-మెడికల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. వివిధ రైల్వే రీజియన్లలో 1,376 పారా మెడికల్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.
ఆర్‌ఆర్‌బీ రీజియన్లు : అహ్మదాబాద్, చెన్నై, ముజఫర్‌పుర్, అజ్‌మేర్, గోరఖ్‌పుర్, పట్నా, బెంగళూరు, గువాహటి, ప్రయాగ్‌రాజ్, భోపాల్, జమ్ము- శ్రీనగర్, రాంచీ, భువనేశ్వర్, కోల్‌కతా, సికింద్రాబాద్, బిలాస్‌పుర్, మాల్దా, సిలిగురి, ముంబయి, తిరువనంతపురం.
ఖాళీల వివరాలు ఇలా!
- డైటీషియన్ (లెవల్-7): 05 పోస్టులు
- నర్సింగ్ సూపరింటెండెంట్: 713 పోస్టులు
- అడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్: 04 పోస్టులు
- క్లినికల్ సైకాలజిస్ట్: 07 పోస్టులు
- డెంటల్ హైజీనిస్ట్: 03 పోస్టులు
- డయాలసిస్ టెక్నీషియన్: 20 పోస్టులు
- హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్ గ్రేడ్-III: 126 పోస్టులు
- ల్యాబొరేటరీ సూపరింటెండెంట్: 27 పోస్టులు
- పెర్ఫ్యూషనిస్ట్: 02 పోస్టులు
- ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్-II: 20 పోస్టులు
- ఆక్యుపేషనల్ థెరపిస్ట్: 02 పోస్టులు
- క్యాథ్ ల్యాబొరేటరీ టెక్నీషియన్: 02 పోస్టులు
- ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్): 246 పోస్టులు
- రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్: 64 పోస్టులు
- స్పీచ్ థెరపిస్ట్: 01 పోస్టు
- కార్డియాక్ టెక్నీషియన్: 04 పోస్టులు
- ఆప్టోమెట్రిస్ట్: 04 పోస్టులు
- ఈసీజీ టెక్నీషియన్: 13 పోస్టులు
- ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్-II: 94 పోస్టులు
- ఫీల్డ్ వర్కర్: 19 పోస్టులు
మొత్తం ఖాళీలు: 1,376
ఉద్యోగ అర్హతలు :పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, జీఎన్‌ఎం, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.