RRB Group D Recruitment 2025 : రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ఏకంగా 32,438 గ్రూప్-డి పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకోసం లెవల్-1 పోస్టులకు సంబంధించి సంక్షిప్త ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. పూర్తి వివరాలు మీ కోసం.
పోస్టుల వివరాలు
RRB Group D Posts :పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ లెవల్ -1 గ్రూప్-డీ పోస్టులు. మొత్తం 32,438 పోస్టులు ఉన్నాయి.
విభాగాలు
ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ట్రాఫిక్ మొదలైనవి.
విద్యార్హతలు
RRB Group D Eligibility :అభ్యర్థులు 10వ తరగతి, ఐటీఐ అర్హతలతో పాటు, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి
RRB Group D Age Limit :అభ్యర్థుల వయస్సు 2025 జులై 1 నాటికి 18-36 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం - ఓబీసీ, పీహెచ్, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు ఉంటాయి.
దరఖాస్తు రుసుము
RRB Group D Fee :జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.500 చెల్లించాలి. మహిళలు, ఈబీసీలు, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక ప్రక్రియ
RRB Group D Selection Process :కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, అర్హులైన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు
RRB Group D Salary :గ్రూప్-డి పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18,000 వరకు జీతం ఇస్తారు. ఇతర భత్యాలు కూడా ఉంటాయి.
ఆర్‌ఆర్‌బీ రీజియన్లు
సికింద్రాబాద్, చెన్నై, భువనేశ్వర్, బెంగళూరు, అహ్మదాబాద్, అజ్‌మేర్, భోపాల్, బిలాస్‌పూర్, చండీగఢ్, గోరఖ్‌పుర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ
ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ విడుదలైన తేదీ: 2024 డిసెంబర్ 28
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 2025 జనవరి 23
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2025 ఫిబ్రవరి 22
నోట్ : గ్రూప్-డి పోస్టుల వివరాలు, విద్యార్హతలు, ఎంపిక విధానం, సిలబస్ తదితర పూర్తి వివరాలను ఆర్‌ఆర్‌బీ త్వరలో విడుదల చేయనుంది.