RCF Apprentice Jobs 2024 : ఇండియన్ రైల్వేస్‌లో ఉద్యోగం చేయాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అలాంటి వారికి శుభవార్త. పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో ఉన్న రైల్ కోచ్ ఫ్యాక్టరీ 550 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- ఫిట్టర్ - 200
- వెల్డర్ (G&E) - 230
- మెషినిస్ట్ - 5
- పెయింటర్ (G) - 20
- కార్పెంటర్ - 5
- ఎలక్ట్రీషియన్ - 75
- ఏసీ& రిఫ్రిజిరేషన్ మెకానిక్ - 15
- మొత్తం పోస్టులు - 550
విద్యార్హతలు
RCF Apprentice Qualifications :అభ్యర్థులు 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ పొంది ఉండాలి.
వయోపరిమితి
RCF Apprentice Age Limit :అభ్యర్థుల వయస్సు 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వివిధ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము
RCF Apprentice Application Fee :జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి. మహిళలు, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు విధానం
RCF Apprentice Selection Process :
- అభ్యర్థులు ముందుగా రైల్ కోచ్ ఫ్యాక్టరీ అధికారిక వెబ్సైట్ https://pardarsy.railnet.gov.in/apprentice/ ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజ్‌లోని RCF Apprentice Apply Linkపై క్లిక్ చేయాలి.
- అవసరమైన వివరాలు అన్నీ నమోదు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
- వెంటనే మీకొక రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ అవుతాయి. వాటిని ఉపయోగించి వెబ్సైట్లో మళ్లీ లాగిన్ కావాలి.
- మీకు నచ్చిన అప్రెంటీస్ ట్రేడ్‌ను ఎంచుకోవాలి.
- దరఖాస్తు ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
- ముఖ్యమైన పత్రాలు అన్నీ అప్లోడ్ చేయాలి.
- దరఖాస్తు రుసుము కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
RCF Apprentice Apply Last Date :
- రిజిస్ట్రేషన్ ప్రారంభం :2024 మార్చి 11
- రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ :2024 ఏప్రిల్ 9
ఇంజినీరింగ్ అర్హతతో NHPCలో 280 పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 'నవోదయ'లో 1377 నాన్-టీచింగ్ పోస్టులు భర్తీ!