Railway Jobs 2024 : సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 1113 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
డీఆర్ఎం ఆఫీస్ రాయ్‌పుర్ డివిజన్ :
- వెల్డర్ - 161
- టర్నర్ - 54
- ఫిట్టర్ - 207
- ఎలక్ట్రీషియన్ - 212
- స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్) - 15
- స్టెనోగ్రాఫర్ (హిందీ) - 8
- కంప్యూటర్ ఆపరేటర్/ ప్రోగ్రామ్ అసిస్టెంట్ - 10
- హెల్త్ & శానిటరీ ఇన్స్పెక్టర్ - 25
- మెషినిస్ట్ - 15
- మెకానికల్ డీజిల్ - 81
- మెకానికల్ ఆర్&ఏ కండిషనర్ - 21
- మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ - 35
వేగన్ రిపైర్ షాప్ రాయ్‌పుర్
- వెల్డర్ - 110
- టర్నర్ - 14
- ఫిట్టర్ - 110
- మెషినిస్ట్ - 15
- ఎలక్ట్రీషియన్ - 14
- కంప్యూటర్ ఆపరేటర్/ ప్రోగ్రామ్ అసిస్టెంట్ - 4
- స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్) - 1
- స్టెనోగ్రాఫర్ (హిందీ) - 1
- మొత్తం పోస్టులు - 1113
విద్యార్హతలు
SECR Apprentice Eligibility : అభ్యర్థులు 10, 10+2తో పాటు, సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ చేసి ఉండాలి.
వయోపరిమితి
SECR Apprentice Age Limit :అభ్యర్థుల వయస్సు 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.
దరఖాస్తు రుసుము
SECR Apprentice Fee :నోటిఫికేషన్లో దరఖాస్తు రుసుము గురించి ప్రస్తావించలేదు. కనుక అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం
SECR Apprentice Selection Process :టెన్త్, ఇంటర్, ఐటీఐల్లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత వారికి మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాదిపాటు అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ ఇస్తారు.
దరఖాస్తు విధానం
SECR Apprentice Application Process :
- అభ్యర్థులు ముందుగా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్సైట్ https://www.apprenticeshipindia.gov.in ఓపెన్ చేయాలి.
- దరఖాస్తు ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
SECR Apprentice Apply Last Date :
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2024 ఏప్రిల్ 2
- దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 మే 1
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 733 అప్రెంటీస్ పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా! - Railway Jobs 2024
మీరు ఆర్ట్స్ విద్యార్థులా? ఈ టాప్-10 కెరీర్ ఆప్షన్స్‌పై ఓ లుక్కేయండి! - Career Options After 12th Arts