PGCIL Notification 2024 :దిల్లీలోని పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దేశవ్యాప్తంగా పీజీసీఐఎల్ కేంద్రాలు/ ప్రాజెక్ట్/ రీజియన్లలో వివిధ విభాగాల్లో ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 1,031 అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి. ఇందులో ఏపీ/ తెలంగాణ ప్రాంతాల్లో 68 పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 8వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పీజీసీఐఎల్ కేంద్రం/ ప్రాజెక్ట్/ రీజియన్:సదరన్ రీజియన్-I (హైదరాబాద్), సదరన్ రీజియన్-II (బెంగళూరు),కార్పొరేట్ సెంటర్ (గురుగ్రామ్), నార్తెర్న్ రీజియన్-I (ఫరీదాబాద్), నార్తెర్న్ రీజియన్-II (జమ్ము), నార్తెర్న్ రీజియన్-III (లఖ్‌నవూ), ఈస్ట్రన్ రీజియన్-I (పట్నా), ఈస్ట్రన్ రీజియన్-II (కోల్‌కతా), నార్త్ ఈస్ట్రన్ రీజియన్ (షిల్లాంగ్), ఒడిశా ప్రాజెక్ట్ (భువనేశ్వర్), వెస్ట్రన్ రీజియన్-I (నాగ్‌పుర్), వెస్ట్రన్ రీజియన్-II (వడోదర),
ప్రకటన వివరాలు
ఐటీఐ/ డిప్లొమా/ గ్రాడ్యుయేట్/ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్/ రాజ్‌భాష అసిస్టెంట్/ సీఎస్‌ఆర్ ఎగ్జిక్యూటివ్/ లా ఎగ్జిక్యూటివ్/ పీఆర్ అసిస్టెంట్ అప్రెంటీస్‌షిప్
విభాగాలు, ట్రేడులు : ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రానిక్స్/ టెలికాం.
అర్హతలు :పోస్టులను అనుసరించి అభ్యర్థులు ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ (ఇంజినీరింగ్), ఎంబీఏ, పీజీ డిప్లొమా, ఎల్‌ఎల్‌బీ, బీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
అప్రెంటిస్‌షిప్ కాలం :ఒక సంవత్సరం.