NVS Recruitment 2024 : నవోదయ విద్యాలయ సమితి 1377 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయ సమితికి చెందిన కార్యాలయాల్లో, జవహర్ నవోదయ విద్యాలయాల్లో పని చేయాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- ఫిమేల్ స్టాఫ్ నర్స్ - 121 పోస్టులు
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ - 5 పోస్టులు
- ఆడిట్ అసిస్టెంట్ - 12 పోస్టులు
- జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ - 4 పోస్టులు
- లీగల్ అసిస్టెంట్ - 1 పోస్టు
- స్టెనోగ్రాఫర్ - 23 పోస్టులు
- కంప్యూటర్ ఆపరేటర్ - 2 పోస్టులు
- క్యాటరింగ్ సూపర్వైజర్ - 78 పోస్టులు
- జూనియర్ సెక్ట్రటేరియట్ అసిస్టెంట్ - 381 పోస్టులు
- ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ - 128 పోస్టులు
- ల్యాబ్ అటెండెంట్ - 161 పోస్టులు
- మెస్ హెల్పర్ - 442 పోస్టులు
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 19 పోస్టులు
- మొత్తం పోస్టులు - 1,377
విద్యార్హతలు
Navodaya Non-Teaching Jobs Qualifications :ఆయా పోస్టులను అనుసరించి అభ్యర్థులు 10, 10+2, డిగ్రీ, డిప్లొమా, పీజీలు చేసి ఉండాలి. పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి
Navodaya Non-Teaching Jobs Age Limit :అభ్యర్థుల వయస్సు ఆయా పోస్టులను బట్టి మారుతుంటుంది. అయితే అన్ని పోస్టులకు కలిపి కనిష్ఠ వయస్సు 18 ఏళ్లు, గరిష్ఠ వయస్సు 40 ఏళ్లు ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
దరఖాస్తు రుసుము
Navodaya Non-Teaching Job Application Fee :
- ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.1500 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.
- మిగతా అన్ని పోస్టులకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.1000 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.