Navodaya Vidyalaya Samiti Recruitment 2024 : నవోదయ విద్యాలయ సమితి 1377 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ తేదీని మే 7వరకు పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఎలా అప్లై చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం..
ఉద్యోగాల వివరాలు:
- ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులు - 121
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ - 5
- ఆడిట్ అసిస్టెంట్ - 12
- జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ - 4
- లీగల్ అసిస్టెంట్ - 1
- స్టెనోగ్రాఫర్ - 23
- కంప్యూటర్ ఆపరేటర్ - 2
- క్యాటరింగ్ సూపర్‌వైజర్ - 78
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ - 381
- ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ - 128
- ల్యాబ్ అటెండెంట్ 161
- మెస్ హెల్పర్ - 442
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 19
అర్హతలు(Navodaya Non-Teaching Jobs Qualification):పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి(Navodaya Non-Teaching Jobs Age Limit):అభ్యర్థుల వయసు ఆయా పోస్టులను బట్టి మారుతుంటుంది. అయితే అన్ని పోస్టులకు కలిపి కనిష్ఠ వయస్సు 18 ఏళ్లు, గరిష్ఠ వయస్సు 40 ఏళ్లు ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
అప్లికేషన్ ఫీజు(Navodaya Non-Teaching Jobs Application Fee):
- ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులకు.. జనరల్, OBC, EWS కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు రూ.1500 కాగా, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.
- మిగతా అన్ని పోస్టులకు జనరల్, EWS, OBC అభ్యర్థులు రూ.1000 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.