Naval Dockyard Recruitment 2024 :ముంబయి నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటీస్ స్కూల్ 301 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- ఏడాది అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ - 288 పోస్టులు
- రెండేళ్ల అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ - 13 పోస్టులు
- మొత్తం పోస్టులు - 301
ట్రేడ్స్ : ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రోప్లేటర్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, మెకానిక్ (డీజిల్), ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, ఎంఎంటీఎం, పెయింటర్ (జి), ప్యాటర్న్ మేకర్, పైప్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ, షీట్ మెటల్ వర్కర్, షిప్ రైట్ (ఉడ్), టైలర్ (జి), వెల్డర్ (జి అండ్ ఇ), మేసన్ (బీసీ), ఐ అండ్ సీటీఎస్‌ఎం, షిప్ రైట్ (స్టీల్), రిగ్గర్, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్
విద్యార్హతలు
Naval Dockyard Apprentice Job Qualifications : అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా ఎనిమిదో తరగతి, పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌ల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి
Naval Dockyard Apprentice Age Limit :అభ్యర్థుల వయస్సు 14 ఏళ్లు - 21 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 2002 నవంబర్ 21 నుంచి 2009 నవంబర్ 21 మధ్య జన్మించి ఉండాలి.
ఫిజికల్ స్టాండర్డ్స్
Naval Dockyard Apprentice Physical Standards :
- ఎత్తు - 150 సెం.మీ
- బరువు - 45 కేజీల కంటే ఎక్కువ ఉండాలి.
- ఛాతీ - ఊపిరి పీల్చినప్పుడు 5 సెం.మీ కంటే ఎక్కువ సాగాలి.
- ఐ సైట్ - 6/6 నుంచి 6/9 మధ్య ఉండాలి.