IOCL Apprentice Recruitment 2024 : నిరుద్యోగ యువతకు శుభ వార్త. చెన్నైలోని అతిపెద్ద భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) 400 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సదరన్ డివిజన్ పరిధిలో మొత్తం ఆరు రీజియన్లు ఉన్నాయి. అవి: తమిళనాడు, పుదుచ్ఛేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.
ఖాళీల వివరాలు:
1. ట్రేడ్ అప్రెంటీస్ : 95 ఖాళీలు
2. టెక్నీషియన్ అప్రెంటీస్ : 105 ఖాళీలు
3. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్/ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ : 200 ఖాళీలు
మొత్తం ఖాళీలు: 400 (యూఆర్- 192, ఓబీసీ- 103, ఈడబ్ల్యూఎస్- 37, ఎస్సీ- 56, ఎస్టీ- 12).
విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తదితరాలు.
విద్యార్హతలు
IOCL Jobs Eligibility : సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీబీఏ, బీఏ, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి
IOCL Apprentice Age Limit : 2024 జులై 31 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము
IOCL Application Fee : ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ
IOCL Apprentice Selection Process : రాత పరీక్ష, వైద్య పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం
IOCL Job Application Process :
- ముందుగా మీరు ఐవోసీఎల్ అధికారిక వెబ్సైట్ https://iocl.com/ ఓపెన్ చేయాలి.
- అభ్యర్థులు ముందుగా సంబంధిత విభాగాల్లో కింద ఇచ్చిన వెబ్సైట్లో రిజిస్ట్రర్ చేసుకోవాలి.
- ట్రేడ్ అప్రెంటిస్ అయితే http://apprenticeshipindia.org/candidate-registratio లో
- టెక్నీషియన్ అప్రెంటిస్ https://nats.education.gov.in/student_register.php లో
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్/ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ https://myaadhaar.uidai.gov.in/login లో రిజిస్ట్రర్ చేసుకోవాలి.
- మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీలను నమోదు చేసి, రిజిస్టర్ చేసుకోవాలి.
- వెంటనే మీ మెయిల్‌కు ఒక రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్వర్డ్ వస్తుంది.
- వాటితో మళ్లీ వెబ్సైట్లోకి లాగిన్ కావాలి.
- అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాలి
ముఖ్య తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 2024 ఆగస్టు 2
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2024 ఆగస్టు 19
IBPS భారీ నోటిఫికేషన్ - 4455 పీవో/ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు భర్తీ! - IBPS PO Recruitment 2024
డిగ్రీ అర్హతతో - LICలో 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా! - LIC Recruitment 2024