తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Aug 17, 2024, 10:35 AM IST

ETV Bharat / education-and-career

నిరుద్యోగులకు గుడ్ న్యూస్‌ - ఇండియన్‌ బ్యాంక్‌లో 300 ఆఫీసర్ పోస్టులు భర్తీ - దరఖాస్తు చేసుకోండిలా! - Indian Bank Notification 2024

Indian Bank Notification 2024 : డిగ్రీలు చేసి బ్యాంకింగ్ రంగ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్‌. ఇండియన్ బ్యాంక్‌ 300 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు మీ కోసం.

Indian Bank jobs 2024
Indian Bank Notification 2024 (ETV Bharat)

Indian Bank Notification 2024 : బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అవుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్‌. ఇండియన్ బ్యాంక్‌ 300 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్హత, ఆసక్తి ఉన్న వాళ్లు https://www.indianbank.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి గడువులోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ - 50 పోస్టులు
  • మహారాష్ట్ర - 40 పోస్టులు
  • గుజరాత్‌ - 15 పోస్టులు
  • కర్ణాటక - 35 పోస్టులు
  • తమిళనాడు/ పుదుచ్చేరి - 160 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 300

విద్యార్హతలు
అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి
అభ్యర్థుల వయస్సు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.

దరఖాస్తు రుసుము

  • జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.1000 చెల్లించాలి.
  • దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు దరఖాస్తు రుసుముగా రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల అప్లికేషన్‌లను షార్ట్ లిస్ట్ చేసి, తరువాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. లేదా ముందుగా ఆన్‌లైన్‌లో రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఒడపోస్తారు. తరువాత ఇంటర్వ్యూ చేసి అర్హులను లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం

  • రీజనింగ్‌ & కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ - 45 ప్రశ్నలకు 60 మార్కులు ఉంటాయి.
  • జనరల్‌/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్ - 40 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి.
  • ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ - 35 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి.
  • డేటా అనాలసిస్‌ & ఇంటర్‌ప్రిటేషన్‌ - 35 ప్రశ్నలకు 60 మార్కులు ఉంటాయి.
  • మొత్తం 155 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. ఈ పరీక్షను 180 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

జీతభత్యాలు
లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు జీతం ఉంటుంది. ఇది కాక డీఏ, సీసీఏ, హెచ్‌ఆర్‌ఏ/ లీజ్డ్‌ అకామడేషన్‌, లీవ్‌ ఫేర్‌ కన్సిషన్‌, మెడికల్ ఎయిడ్‌, హాస్పిటలైజేషన్ బెనిఫిట్స్‌, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌ ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2024 ఆగస్టు 13
  • దరఖాస్తుకు చివరి తేదీ : 2024 సెప్టెంబర్‌ 2

వెస్ట్రన్​ రైల్వేలో 'స్పోర్ట్స్ కోటా' పోస్టులు​ - రాత పరీక్ష లేదు - దరఖాస్తు చేసుకోండిలా! - Railway Sports Quota Jobs

ఐటీఐ అర్హతతో - HALలో 324 ఉద్యోగాలు - దరఖాస్తుకు మరికొద్ది రోజులే ఛాన్స్​! - HAL Recruitment 2024

ABOUT THE AUTHOR

...view details