తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఇండియన్ ఆర్మీ ఆహ్వానం - దరఖాస్తుకు మరికొద్ది రోజులే ఛాన్స్​! - India Army Jobs - INDIA ARMY JOBS

Indian Army Technical Graduate Course : బీఈ, బీటెక్​ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్​. ఇండియన్ ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్​లకు ఆహ్వానం పలుకుతోంది. ఎంపికైన వారిని శిక్షణ అనంతరం లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. పూర్తి వివరాలు మీ కోసం.

indian army technical graduate course
indian army lieutenant Posts

By ETV Bharat Telugu Team

Published : Apr 23, 2024, 10:53 AM IST

Indian Army Technical Graduate Course : ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని ఆశించే వారందరికీ గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీ బీఈ, బీటెక్ చేసిన (టెక్నికల్ గ్రాడ్యుయేట్​) అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న వారు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్​ఎస్​బీ) ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఇలా ఎంపికైన అభ్యర్థులకు గ్రాడ్యుయేట్ కోర్స్​ (టీజీసీ)లో శిక్షణ ఇస్తుంది. శిక్షణ అనంతరం లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటుంది.

పోస్టుల వివరాలు

  • సివిల్ ​ - 7
  • కంప్యూటర్ సైన్స్​ - 7
  • ఎలక్ట్రికల్​ - 3
  • ఎలక్ట్రానిక్స్​ - 4
  • మెకానికల్​ - 7
  • ఇతర విభాగాల్లో - 2

విద్యార్హతలు :
నిర్దేశిత ఇంజినీరింగ్ కోర్సులు చేసిన వారు, ప్రస్తుతం చివరి ఏడాది చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ కోర్స్​కు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ సైన్స్‌ పోస్టులకు ఎమ్మెస్సీ సీఎస్‌/ఐటీ చేసినవాళ్లు కూడా అర్హులే.

ఏజ్​ లిమిట్​
అభ్యర్థుల వయస్సు 2025 జనవరి 1 నాటికి 20 ఏళ్ల నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, 1998 జనవరి 2 నుంచి 2005 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.

సెలక్షన్ ప్రాసెస్​
ఇండియన్ ఆర్మీ ఏటా టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్​ (టీజీసీ) కోసం ప్రకటన చేస్తుంటుంది. ఈ కోర్సులకు అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. ఆసక్తి ఉన్నవాళ్లు ఇండియన్ ఆర్మీ వెబ్​సైట్​ https://joinindianarmy.nic.inలో అప్లై చేసుకోవాలి. ఇందుకోసం ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ముందుగా బీటెక్​లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను వడపోస్తారు. తరువాత వీరికి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్​బీ) 5 రోజుల పాటు రెండు దశల్లో సైకలాజికల్ టెస్ట్, గ్రూప్​ టెస్టింగ్​​, ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇదంతా బెంగళూరు కార్యాలయంలో జరుగుతుంది.

మొదటి రోజు స్టేజ్​-1 స్క్రీనింగ్ (ఇంటెలిజెన్స్​) పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను స్టేజ్​-2కు ఎంపిక చేస్తారు. వీరికి 4 రోజుల పాటు పలు విభాగాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో కూడా క్వాలిఫై అయిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఎంపిక చేస్తారు.

నోట్​ : ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులకు ప్రయాణ ఖర్చులు కూడా అందిస్తారు.

ట్రైనింగ్​
టెక్నికల్ గ్రాడ్యుయేట్​ కోర్సుకు ఎంపికైన అభ్యర్థులకు, ఇండియన్‌ మిలటరీ అకాడమీ, దేహ్రాదూన్‌లో 2024 జనవరి నుంచి ఒక ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు. ఈ ట్రైనింగ్ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులను లెఫ్టినెంట్‌ హోదాతో (పర్మినెంట్ జాబ్​) శాశ్వత ప్రాతిపదికన విధుల్లోకి తీసుకుంటారు.

జీతభత్యాలు
లెఫ్టినెంట్​ ఉద్యోగంలో చేరిన తర్వాత లెవల్‌-10 స్కేల్ ప్రకారం, రూ.56,100 సాలరీ ఇస్తారు. అలాగే రూ.15,500 మిలటరీ సర్వీస్‌ పే చెల్లిస్తారు. వీటికి తోడు డీఏ, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తారు. అందువల్ల మొదటి నెల నుంచే సుమారుగా రూ.1 లక్షకుపైగా జీతం లభిస్తుంది.

లెఫ్టినెంట్ జాబ్​కు ఎంపికైన అభ్యర్థులు చాలా తక్కువ వ్యవధిలోనే ఉన్నత హోదాలు సొంతం చేసుకోవచ్చు. కేవలం 2 ఏళ్ల సర్వీసుతో కెప్టెన్; 6 ఏళ్ల సర్వీస్​తో మేజర్, 13 ఏళ్ల సేవలతో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలకు ఎదగవచ్చు. పదవీ విరమణ తరువాత జీవితాంతం పింఛను అందుకోవచ్చు.

ఆన్​లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 మే 9 మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

కృత్రిమ మేధ (AI) ఎంత డెవలప్ అయినా - ఈ జాబ్స్​ మాత్రం సేఫ్​! - Jobs That Are Safe From AI

నావల్ డాక్​యార్డ్​లో 301 అప్రెంటీస్ పోస్టులు - అప్లై చేసుకోండిలా! - Naval Dockyard Apprentice Posts

ABOUT THE AUTHOR

...view details