తెలంగాణ

telangana

ఎంత చదివినా గుర్తుండడం లేదా? జ్ఞాపకశక్తిని పెంచే టాప్​-10 టిప్స్​ ఇవే! - How To Improve Memory

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2024, 12:29 PM IST

How To Improve Memory : చాలా మంది బాగా కష్టపడి చదువుతారు. కానీ వారికి ఏదీ గుర్తుండదు. దీనికి ప్రధాన కారణం జ్ఞాపక శక్తి లోపించడం. దీనితో తమకు ఏదీ గుర్తుండడం లేదని తీవ్రంగా బాధపడుతుంటారు. మరి మీరు కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారా? డోంట్ వర్రీ. చాలా సులువుగా జ్ఞాపక శక్తిని పెంచుకునే చిట్కాల గురించి ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

study tips
ways to improve memory (ETV Bharat)

How To Improve Memory :కొంత మంది విద్యార్థులు ఒక్కసారి చదివినా సరే భలే గుర్తుపెట్టుకుంటారు. మరికొందరు ఎంత చదివినా, వారికి ఏమీ గుర్తుండదు. దీనితో తీవ్ర ఆవేదనకు గురవుతుంటారు. మరి మీరు కూడా ఇలానే అవస్థ పడుతున్నారా? డోంట్​ వర్రీ. చాలా సులువుగా మీరు జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

  • మీరు చదవాల్సిన అంశాన్ని బాగా అర్థం చేసుకొని చదవడానికి ప్రయత్నించాలి. మొత్తం పాఠాన్ని ఒకేసారి కాకుండా చిన్న చిన్న భాగాలుగా చేసుకుని చదవాలి.
  • కొంత మంది ఒకే సబ్జెక్ట్​కు చెందిన అనేక పుస్తకాలు కొంటారు. అన్నింటినీ చదివేయాలని ప్రయత్నిస్తుంటారు. కానీ ఇది సరైన విధానం కాదు. అందుబాటులో ఉన్న సమాచారం మొత్తాన్ని అలాగే గుర్తుంచుకోవాలని ప్రయత్నించకూడదు.
  • చదివేటప్పుడు మీకు మీరే ప్రశ్నలు వేసుకుంటూ సమాధానాలను రాబట్టుకుంటూ నేర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల విషయం బాగా అర్థమవుతుంది. పైగా ఎక్కువ కాలంపాటు గుర్తుంటుంది కూడా. అందువల్ల పరీక్షల్లో ప్రశ్నలను ఎన్ని రకాలుగా అడిగినా, తికమక పడకుండా సమాధానాలు రాయగలుగుతారు.
  • చాలా మంది ఒకసారి చదివిన తరువాత మళ్లీ దాని జోలికి పోరు. ఇది మంచిది కాదు. చదివినదాన్ని మళ్లీ పునశ్చరణ (రివిజన్​) చేసుకుంటూ ఉండాలి.
  • చదివేటప్పుడు మన బలాలు, బలహీనతలను కూడా సమీక్షించుకోవాలి. అప్పుడే మీరు ఏయే అంశాల్లో వెనకబడి ఉన్నారో స్పష్టంగా తెలుస్తుంది. దీనితో వాటికి ఎక్కువ సమయాన్ని కేటాయించుకుని మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
  • 'ఎన్నిసార్లు చదివినా నాకు గుర్తుండవు. ఎప్పటికప్పుడు మర్చిపోతూనే ఉంటాను’ అని బాధపడటం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. తరచూ ప్రతికూల ఆలోచనలు చేయడం వల్ల ఫలితాలు కూడా ప్రతికూలంగానే వస్తాయి. కాబట్టి వాటిని దరిదాపుల్లోకి రానీయకుండా జాగ్రత్తపడాలి. ముందుగా మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకోవాలి. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు స్ఫూర్తిని నింపుతాయి. దాన్ని అందిపుచ్చుకుంటే సమర్థంగా చదవగలుగుతారు. అలా నేర్చుకున్నదాన్ని అంత త్వరగా మర్చిపోలేరు కూడా.
  • చాలా మంది తెలివైన వాళ్లు అనుసరించే విధానాన్ని కాపీ కొట్టాలని చూస్తారు. మరికొందరు విజేతలు చెప్పిన విధానాన్ని అనుసరిస్తారు. కానీ ఇది అందరికీ వర్కౌట్ అవ్వదు. కనుక ఎవరికి అనువైన పద్ధతిని వాళ్ల అనుసరిస్తేనే ప్రయోజనం ఉంటుంది.

జ్ఞాపక శక్తిని పెంచుకునే పద్ధతులు
మనం ఏదైనా అంశాన్ని నేర్చుకోవాలన్నా, లేదా దానిని దీర్ఘకాలంపాటు గుర్తుంచుకోవాలన్నా అందుకు కొన్ని పద్ధతులు ఉపయోగించాలి. అవే విజువల్, ఆడిటరీ, కైనీస్తటిక్‌ అనే మూడు పద్ధతులు.

  • విజువల్‌ :ఈ పద్ధతిలో గ్రాఫ్‌లు, పవర్‌పాయింట్​ ప్రెజంటేషన్​లు, ఇల్లస్ట్రేషన్లు, వీడియోలు, బొమ్మల ఆధారంగా నేర్చుకోవచ్చు. ఇవి కంటికి ఎదురుగా కనిపిస్తాయి కాబట్టి త్వరగా మర్చిపోలేరు.
  • ఆడిటరీ : బృంద చర్చల్లో పాల్గొనడం, ఓరల్‌ ప్రజంటేషన్లు, పాడ్‌కాస్ట్‌లు, ఆడియోలు వినడం వల్ల కూడా జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
  • కైనీస్తటిక్‌ : నోట్‌ టేకింగ్, సమావేశాలకు హాజరుకావడం, రోల్‌-ప్లేయింగ్‌ మొదలైనవన్నీ ఈ పద్ధతిలో ఉంటాయి. చూశారుగా ఈ పద్ధతులు ఉపయోగించి, క్రమం తప్పకుండా, అర్థం చేసుకుంటూ చదివితే మీ జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. ఆల్​ ది బెస్ట్​!

ABOUT THE AUTHOR

...view details