తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారా? ఈ 10 టిప్స్ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ! - Exam Preparation Tips - EXAM PREPARATION TIPS

Exam Preparation Tips : మీరు పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారా? కచ్చితంగా ఉద్యోగం సాధించాలని పట్టుదలగా ఉన్నారా? అయితే ఇది మీ కోసమే. ఈ ఆర్టికల్​లో చెప్పిన 10 టిప్స్ పాటిస్తే, పోటీ పరీక్షల్లో సునాయాసంగా విజయం సాధించడం పక్కా!

How to make an effective study plan
Exam Preparation Tips

By ETV Bharat Telugu Team

Published : Apr 16, 2024, 11:00 AM IST

Exam Preparation Tips :పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు. చదవడానికి తక్కువ టైమ్ ఉందని కంగారుపడుతుంటారు. సరైన ప్రణాళికలు లేక అవస్థలు పడుతుంటారు. అందుకే ఈ ఆర్టికల్​లో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు ఒత్తిడిని జయించి ఎగ్జామ్స్​ను బాగా రాసేందుకు పాటించాల్సిన 10 టిప్స్ గురించి తెలుసుకుందాం.

1. స్టడీ ప్లాన్‌ను రూపొందించుకోవాలి : ముందుగా ఒక అధ్యయన ప్రణాళిక (టైమ్ టేబుల్) వేసుకోవాలి. రోజువారీగా చదవాల్సిన సబ్జెక్టులు, టాపిక్​లను నిర్దేశించుకోవాలి. ప్రతి సబ్జెక్టును కవర్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి.

2. చదవడానికి అనువైన వాతావరణం : మీరు చదివేందుకు ఆహ్లాదకరమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని ఎంచుకోవాలి. అప్పుడే మీకు చదువుపై ఏకాగ్రత మరింత పెరుగుతుంది. ఇంటిలో, హాస్టల్​లో చదివేవారు స్వచ్ఛమైన గాలి వచ్చే, నిశ్శబ్దంగా ఉండే స్థలాన్ని ఎంచుకోవాలి. చదువుతున్నప్పుడు మీ ఫోన్‌ను ఆఫ్ చేయాలి. లేదంటే ఫ్లైట్ మోడ్‌లో ఉంచాలి. కుర్చీ లేదా టేబుల్​పై మీకు నచ్చిన విధంగా కూర్చొని చదవాలి.

3. బ్రేక్ తీసుకోవాలి :చదువుతున్నప్పుడు మధ్య మధ్యలో కచ్చితంగా విరామాలు తీసుకోవాలి. అప్పుడే మీ మెదడు బాగా పనిచేస్తుంది. విరామాలు లేకుండా ఎక్కువ గంటలు చదివితే కొన్నిసార్లు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అందుకే చదువు మధ్యలో బ్రేక్ తీసుకోవడం, సరదాగా ఇంట్లో నడవడం లాంటివి చేయాలి.

4. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి :మంచి ఆహారపు అలవాట్లు ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అసహజమైన నిద్ర, అలసట నుంచి తప్పించుకోవాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. శరీరం హైడ్రేట్‌గా ఉండేందుకు ఎక్కువ నీరు తాగాలి. గింజలు, పెరుగు తీసుకోవడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

5. నిద్ర తప్పనిసరి :రోజూ సరపడినంత నిద్రపోవాలి. నిద్ర సమయంలోనే శరీరం, మెదడు విశ్రాంతి తీసుకుంటాయి. రోజుకు 8 గంటల నిద్ర పోవాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అయితే కొంత మంది అర్ధరాత్రి వరకు చదవడానికి ఇష్టపడతారు. మరికొందరు ఉదయాన్నే లేచి చదువుతారు. కాబట్టి రోజులో ఎంత సమయం నిద్ర సరిపోతుందో మీరే స్వయంగా నిర్ణయించుకోవాలి.

6. కంబైన్ స్టడీస్ వల్ల లాభాలు :అప్పుడప్పుడు కంబైన్డ్ స్టడీస్ చేయాలి. దీని వల్ల మీ సందేహాలను తీర్చుకునే అవకాశం పెరుగుతుంది. అలాగే పక్కన చదువుతున్నవారితో డిస్కస్ చేయడం వల్ల ఆ ప్రశ్నలప, సమాధానాలు మీకు గుర్తుండే ఛాన్స్ పెరుగుతుంది.

7. సిలబస్ కంప్లీట్ చేయాలి :ఏదైనా విషయాన్ని పూర్తిగా నేర్చుకోవాలంటే క్షుణ్ణంగా చదవి సిలబస్ కంప్లీట్ చేయాలి. చదువుతున్నప్పుడు క్లుప్తంగా నోట్స్ తయారుచేసుకోవాలి. రివిజన్ టైమ్​లో ఆ నోట్స్ బాగా పనికొస్తుంది.

8. మోడల్ పేపర్స్, పాత ప్రశ్నాపత్రాలు చదవాలి :సిలబస్​ను పూర్తి చేసిన తరువాత కచ్చితంగా మోడల్ పేపర్స్, పాత ప్రశ్నాపత్రాలను పరిశీలించాలి. దీని వల్ల పరీక్షల్లో అడుగుతున్న ప్రశ్నల సరళి మీకు తెలుస్తుంది.

9. రివిజన్ చేయాలి :పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారు సిలబస్ మొత్తాన్ని కచ్చితంగా రివిజన్ చేసి తీరాలి. పరీక్షకు ఒక వారం ముందు లేదా కనీసం ఎగ్జామ్ ముందు రోజైనా రివిజన్ చేయాలి.

10. నిబంధనలు తెలుసుకోండి : పరీక్షకు ముందు రోజు బాగా నిద్రపోవాలి. పరీక్ష హాల్​కు టైమ్​కు వెళ్లాలి. హాల్ టికెట్​లో ఇచ్చిన వివరాలను క్షుణ్ణంగా చదివి ఫాలో అవ్వాలి. ఈ విధంగా పక్కాగా ప్రిపేర్ అయితే ఎలాంటి పరీక్షల్లో అయినా విజయం సాధించవచ్చు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - RPFలో 4600 ఎస్​ఐ & కానిస్టేబుల్ పోస్టుల భర్తీ - దరఖాస్తు చేసుకోండిలా! - RPF SI And Constable Jobs 2024

NPCILలో 400 ఎగ్జిక్యూటివ్​ పోస్టులు - పరీక్ష లేకుండానే ఉద్యోగం! - NPCIL Executive Trainee Jobs 2024

ABOUT THE AUTHOR

...view details