EPFO Jobs 2024 :ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లోని 323 పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కేటగిరీల వారీగా ఉద్యోగాల వివరాలు
- యూఆర్ - 132 పోస్టులు
- ఓబీసీ - 87 పోస్టులు
- ఈడబ్ల్యూఎస్ - 32 పోస్టులు
- ఎస్టీ - 24 పోస్టులు
- ఎస్సీ - 48 పోస్టులు
- మొత్తం పోస్టులు - 323
విద్యార్హతలు
EPFO PA Job Qualification :బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే స్టెనోగ్రఫీ (ఇంగ్లీష్/హిందీ) నైపుణ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి
EPFO PA Job Age Limit :అభ్యర్థుల వయస్సు కనిష్ఠంగా 18 ఏళ్లు ఉండాలి. అయితే గరిష్ఠ వయస్సు అనేది ఆయా కేటగిరీలను బట్టి మారుతూ ఉంటుంది. అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ఠ వయస్సు 30 ఏళ్లు మించి ఉండకూడదు. ఓబీసీలకు 33 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీలకు 35 ఏళ్లు; దివ్యాంగులకు 40 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు రుసుము
EPFO PA Job Application Fee :జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.25 చెల్లించాలి. మహిళలు, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ
EPFO PA Job Selection Process :అభ్యర్థులకు ముందుగా రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూలు చేసి, అర్హులైన వారిని ఈపీఎఫ్ఓ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపిక చేస్తారు.