తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? పరీక్ష లేకుండానే గవర్నమెంట్ జాబ్ ఇస్తారంట - వెంటనే అప్లై చేసుకోండి - Delhi PMBI Notification 2024 - DELHI PMBI NOTIFICATION 2024

Delhi PMBI Notification : పరీక్ష లేకుండా ఉద్యోగంలో చేరాలి అనుకుంటున్నారా? అలాంటి వారికే న్యూ దిల్లీ ఫార్మా స్యూటికల్స్‌ అండ్‌ మెడికల్‌ డివైజెస్‌ బ్యూరో ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది. కేవలం ఇంటర్య్వూ చేసి జాబ్‌ ఇస్తారంట ఆ వివరాలు ఇవిగో..

Delhi PMBI Notification 2024
Delhi PMBI Notification 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 1, 2024, 12:15 PM IST

Delhi PMBI Notification 2024 :న్యూ దిల్లీలోని ఫార్మా స్యూటికల్స్‌ అండ్ మెడికల్‌ డివైజెస్‌ బ్యూరో ఆఫ్ ఇండియా (పీఎంబీఐ) 44 ఉద్యోగాలను భర్తీ చేయబోతుంది. అది కూడా పరీక్ష లేకుండానే. ఒక్క మౌఖిక పరీక్ష ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తులను ఈ-మెయిల్‌ ద్వారా లేదా ఆన్‌లైన్‌ పోస్టు / కొరియర్ ద్వారా కానీ పంపించవచ్చు. సేల్స్‌ అండ్ మార్కెటింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, క్వాలిటీ, లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చైన్, ఫైనాన్స్‌ అండ్ అకౌంట్స్‌, హెచ్‌ఆర్ అండ్ అడ్మిన్‌, లీగల్‌ డిపార్ట్‌మెంట్లలో ఈ ఉద్యోగాలు ఉన్నాయి.

అసిస్టెంట్ మేనేజర్ - 10 : అర్హతలు

  • ఏదైనా డిగ్రీ
  • ఎంబీఏ - సేల్స్‌/ మార్కెంటిగ్/ సమాన కోర్సు పూర్తి చేయాలి.
  • ఫార్మా రంగంలో సేల్స్/ మార్కెటింగ్‌ విభాగంలో నాలుగు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
  • ముందుగా మూడేళ్ల కాలానికి ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఉద్యోగి పని తీరు సంతృప్తికరంగా ఉంటే, కాంట్రాక్టును పొడిగించే అవకాశం ఉంటుంది.
  • అభ్యర్థుల వయసు 32 సంవత్సరాలు మించకూడదు.

సీనియర్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌-12 : అర్హతలు

  • ఏదైనా డిగ్రీ.
  • ఎంబీఏ - సేల్స్‌/ మార్కెటింగ్‌/ సమాన కోర్సు పూర్తి చేయాలి.
  • ఫార్మా రంగంలోని సేల్స్‌/ మార్కెటింగ్‌ విభాగంలో 3 సంత్సరాల అనుభవం ఉండాలి.
  • ప్రభుత్వ సంస్థలో పని చేసిన వారికి ప్రాధాన్యత
  • వయసు 30 ఏళ్లు మించకూడదు.

3. ఎగ్జిక్యూటివ్‌-12 : అర్హతలు

  • ఏదైనా డిగ్రీ
  • ఎంబీఏ - సేల్స్‌/ మార్కెటింగ్‌/ తత్సమాన కోర్సు
  • ఫార్మా రంగంలోని సేల్స్‌/ మార్కెటింగ్‌ విభాగంలో ఏడాది అనుభవం
  • ప్రభుత్వ సంస్థలో పని చేసిన వారికి ప్రాధాన్యత
  • వయసు 28 సంవత్సరాలు మించకూడదు.

4. సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ -10 : అర్హతలు

  • బి.ఫార్మా/ బీఎస్సీ (బయోటెక్‌)
  • ఎంబీఏ (ఫార్మా) /ఎంఫార్మా/ఎంఎస్సీ (బయోటెక్‌)
  • ప్రొక్యూర్‌మెంట్‌/ పర్చేజింగ్‌ విభాగంలో మూడేళ్ల అనుభవం.
  • ప్రభుత్వ సంస్థలో పని చేసిన వారికి ప్రాధాన్యమిస్తారు.
  • గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు.

డిప్లొమా, ఐటీఐ అర్హతతో BELలో జాబ్స్​- దరఖాస్తుకు లాస్ట్​ డేట్​ ఇదే! - BEL Recruitment 2024

అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారంటే?

  • అభ్యర్థులు పంపించిన అప్లికేషన్స్‌ స్క్రీనింగ్‌, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తును నింపి, విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ధృవపత్రాలను జత చేసి పంపించాలి. వీటి ఆధారంగా అర్హులైన వారిని మౌఖిక పరీక్షకు ఎంపిక చేస్తారు.
  • విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ఒరిజినల్ ధృవపత్రాలతో మౌఖిక పరీక్షకు హాజరు కావాలి. సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాత ఇంటర్వ్యూలో అభ్యర్థి చూపిన ప్రతిభ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.
  • దరఖాస్తు ఫారమ్‌లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని, దాన్ని నింపిన తర్వాత పోస్టు లేదా కొరియర్‌లో పంపించాలి.
  • మూడు సంవత్సరాల కాలానికి ఉద్యోగంలోకి తీసుకున్నప్పటికీ మొదటి ఆరు నెలలు అభ్యర్థి పని తీరును పరిశీలిస్తారు. సంతృప్తికరంగా ఉంటేనే, విధుల్లో కొనసాగిస్తారు లేదంటే తీసేస్తారు.
  • ప్రభుత్వ ఫార్మా రంగంలో పని చేసిన వారికి ప్రాధాన్యమిస్తారు.
  • ఎంపికైన వారిని దేశంలో పీఎంబీఐ యూనిట్లలో ఎక్కడైనా నియమించే అవకాశం ఉంది.
  • నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక వర్గాలకు చెందిన వారికి గరిష్ఠ వయసులో సడలింపులు, రిజర్వేషన్లు వర్తిస్తాయి.

మీ బిహేవియర్​లో మార్పు తీసుకువచ్చే బెస్ట్​ బుక్స్​! ఈ పుస్తకాలు చదివితే లైఫ్​ ఛేంజ్! - Best Personality Development Books

ఏడాదికి రూ.70 లక్షల వరకు శాలరీ- ఇండియాలో హైయెస్ట్​ పేయింగ్​ జాబ్స్ ఇవే!​ - Highest Paying Jobs In India

ABOUT THE AUTHOR

...view details