తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

ఎంత ట్రై చేసినా జాబ్‌ రావట్లేదా! - ఈ మిస్టేక్స్ చేస్తుంటే ఎలా వస్తుంది? - Common Mistakes Applying In Job - COMMON MISTAKES APPLYING IN JOB

Common Mistakes Applying In Job : చదువు పూర్తి కాగానే మంచి కంపెనీలో ఉద్యోగం సాధించాలని అందరూ కోరుకుంటారు. కానీ, ఈ అదృష్టం అందరికీ అంత తొందరగా దక్కదు! చాలా మందికి స్కిల్స్‌ ఉన్నా కూడా జాబ్‌ రాదు. దీనికి కారణం.. వారు జాబ్‌ అప్లై చేసేటప్పుడు చేసే తప్పులేనని నిపుణులంటున్నారు!

Common Mistakes Applying In Job
Common Mistakes Applying In Job

By ETV Bharat Telugu Team

Published : Mar 25, 2024, 9:56 AM IST

Common Mistakes Applying In Job :ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించడం అంత ఈజీ కాదు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఏళ్ల తరబడి కష్టపడి చదవాల్సి ఉంటుంది! ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం సాధించాలంటే వివిధ రకాల స్కిల్స్ తప్పక నేర్చుకుని ఉండాలి. అయితే.. కొంత మందికి అన్ని అర్హతలూ ఉన్నా కూడా జాబ్‌ రాదు! దీనికి కారణం.. ఉద్యోగ ప్రయత్నాల్లో వారు చేసే పొరపాట్లే కారణమని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రెజ్యూమె ఎలా ఉండాలి :
మీకు జాబ్‌ రావడంలో మీ రెజ్యూమె చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే దీన్ని చదవడానికి సులభంగా ఉండేలా రెడీ చేసుకోండి. చాలా మంది రెజ్యూమె ఒకటి కంటే ఎక్కువ పేజీలు ఉండేలా రెడీ చేస్తారు. కానీ, ఇలా ఉండకూడదు. మీరు మీ స్కిల్స్, ఎడ్యుకేషన్, వర్క్‌ హిస్టరీని హైలైట్ చేసేలా ఒక పేజీలో తయారు చేసుకోండి.

పార్ట్ టైమ్ జాబ్​ చేయాలా? ఈ టాప్​-10 ఆప్షన్స్​పై ఓ లుక్కేయండి!

కవర్ లెటర్ :
మీరు ఏ ఉద్యోగానికైతే అప్లై చేసుకున్నారో దానికి ఎందుకు దరఖాస్తు చేసుకున్నారు? మీకు ఉండే స్కిల్స్‌ ఏంటీ ? ఈ కంపెనీలో ఎందుకు పని చేయాలనుకుంటున్నారు ? అనే వివరాలను స్పష్టంగా అర్థమయ్యేలా తప్పులు లేకుండా కవర్‌ లెటర్‌లో రాయండి. ఇది కూడా ఒక పేజీలో ఉండేలా చూసుకోండి.

ఇంటర్వ్యూలో :
చాలా మంది ఇంటర్వ్యూ అనగానే కంగారు పడిపోతుంటారు. ఏ ప్రశ్నలు అడుగుతారోనని ఆందోళన చెందుతుంటారు. అదే సమయంలో వారు అప్లై చేసుకున్న ఉద్యోగం గురించి, కంపెనీకి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుసుకోకుండానే ఇంటర్వ్యూకు హాజరవుతారు. దీనివల్ల వారు.. ఇంటర్య్వూ చేసే వ్యక్తులు "మీరు ఈ ఉద్యోగంలో మీకు ఎదురయ్యే సవాళ్లేంటో చెప్పగలరా?" అనే ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానం చెప్పలేకపోతారు. దీంతో ఉద్యోగానికి ఎంపిక చేయరని నిపుణులు చెబుతున్నారు. అందుకే నిరంతరం సవాళ్లను ఎదుర్కొంటూ, కొత్త విషయాలను నేర్చుకుంటామనే భరోసాను అభ్యర్థులు ఇంటర్య్వూ చేసే వారికి కలిగించాలని చెబుతున్నారు. అలాగే వారు అడిగిన ప్రశ్నలకు సూటిగా, స్పష్టంగా సమాధానం చెప్పాలని సూచిస్తున్నారు. అలాగే ఇంటర్య్వూ ఉండే సమయాని కంటే ముందుగానే కంపెనీకి చేరుకోవాలని గుర్తుంచుకోండి.

నెట్‌వర్క్ ఏర్పరచుకోవాలి :
నేటి డిజిటల్‌ ప్రపంచంలో అన్నీ మారినట్లు గానే ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తిగా మారిపోయింది. కాబట్టి, చదువు పూర్తైన వెంటనే linkedin, naukri వంటి సామాజిక మాధ్యమాలను నిరుద్యోగులు తప్పకుండా ఉపయోగించుకోవాలి. ఇందులో ఒక అకౌంట్‌ తెరిచి కెరీర్‌కు సంబంధించిన వివరాలను ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత మీరు ఎంపిక చేసుకున్న రంగంలోని నిపుణుల గురించి తెలుసుకుని వారితో నెట్‌వర్క్‌ను ఏర్పరచుకోండి. దీనివల్ల మీకు తొందరగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది.

చివరిగా :

  • ఉద్యోగం రాలేదని బాధపడకుండా, ఆత్మవిశ్వాసంతో ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని నేర్చుకుంటూ ముందుకు సాగండి. ఇలా చేయడం వల్ల ఎప్పటికైనా మీరు మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు.
  • అలాగే ఎక్కడెక్కడ జాబ్‌ వెకెన్సీ ఉందో తెలుసుకుని అప్లై చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

మాక్ ఇంటర్వ్యూలకు ఎటెండ్​ కావాలా? ఈ టాప్​-4 ఫ్రీ వెబ్​సైట్స్​పై ఓ లుక్కేయండి!

ఫ్రీలాన్సర్​గా పని చేయాలా? ఈ టాప్​-10 వెబ్​సైట్స్​పై ఓ లుక్కేయండి!

ABOUT THE AUTHOR

...view details