Coal India Recruitment 2024 :మహారత్న హోదా కలిగినప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థకోల్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న సీఐఎల్ కేంద్రాలు, అనుబంధ సంస్థల్లో ఉన్న 640 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాచిలర్స్ డిగ్రీ, బీటెక్ చేసి, గేట్ 2024లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
విభాగాల వారీగా పోస్టుల వివరాలు
- మైనింగ్ ఇంజినీరింగ్ - 263 పోస్టులు
- సివిల్ ఇంజినీరింగ్ - 91 పోస్టులు
- ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ - 102 పోస్టులు
- మెకానికల్ ఇంజినీరింగ్ - 104 పోస్టులు
- సిస్టమ్ ఇంజినీరింగ్ - 41 పోస్టులు
- ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యునికేషన్ - 39 పోస్టులు
- మొత్తం పోస్టులు - 640
కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు
- జనరల్ - 190 పోస్టులు
- ఈడబ్ల్యూఎస్ - 43 పోస్టులు
- ఓబీసీ - 124 పోస్టులు
- ఎస్టీ - 34 పోస్టులు
- ఎస్సీ - 67 పోస్టులు
విద్యార్హతలు
- అభ్యర్థులు కనీసం 60% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ (సివిల్, ఎలక్ట్రికల్, మైనింగ్ ఇంజినీరింగ్) చేసి ఉండాలి. లేదా
- బీఈ, బీటెక్ (ఐటీ, కంప్యూటర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యునికేషన్) చేసి ఉండాలి. లేదా
- ఎంసీఏలో ఉత్తీర్ణులై ఉండాలి.
- వీటితోపాటు గేట్-2025 స్కోర్ ఉండాలి.
వయోపరిమితి
అభ్యర్థుల వయస్సు 2024 సెప్టెంబర్ 30 నాటికి 30 ఏళ్లు మించి ఉండకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.