Central Bank of India Jobs 2024 : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3000 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌ల్లో అప్రెంటీస్లుగా పనిచేయాల్సి ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ఉద్యోగాల వివరాలు
- ఆంధ్రప్రదేశ్ - 100 పోస్టులు (గుంటూరు - 40, విజయవాడ - 30, విశాఖపట్నం - 30)
- తెలంగాణ - 96 పోస్టులు (హైదరాబాద్ -58, వరంగల్ - 38)
- దేశవ్యాప్తంగా 3000 అప్రెంటీస్ పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు
అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి
అభ్యర్థుల వయస్సు 2024 మార్చి 30 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్లలోపు ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.800 + జీఎస్టీ చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.600 + జీఎస్టీ దరఖాస్తు రుసుముగా చెల్లించాలి.
- దివ్యాంగులు రూ.400 + జీఎస్టీ అప్లికేషన్ ఫీజుగా చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. అలాగే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా చేస్తారు. వీటిలో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్నెస్, ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. చివరిగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం, అర్హులైన అభ్యర్థులను అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు.