What To Do After BTech? నేను బీటెక్ (కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ) చదువుతున్నాను. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడాలంటే ఇప్పటి నుంచే ఎలా సన్నద్ధం కావాలి? విదేశాల్లో ఎంఎస్ చేస్తే మేలా? ఉన్నత ఉద్యోగానికి మన దేశంలో అవకాశాలు ఎలా ఉంటాయి? - ఆదిత్య, హైదరాబాద్
కెరియర్ కౌన్సెలర్ ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్ సమాధానం :ప్రస్తుతం మీరు బీటెక్ ఎన్నో సంవత్సరం చదువుతున్నారో చెప్పలేదు. బీటెక్ సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్ చదువుతున్న సూడెంట్స్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడాలి అంటే టెక్నికల్ నైపుణ్యాలు, ప్రాక్టికల్, నిర్దిష్ట డొమైన్ నాలెడ్జ్, అనుభవం అధికంగా ఉండాలి. టెక్నికల్ నైపుణ్యాల విషయానికి వస్తే జావా, జావా స్క్రిప్ట్, సీ ప్లస్ ప్లస్, పైతాన్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి.
ఎస్‌క్యూఎల్, మాంగో డీబీ లాంటి డేటాబేస్ మేనేజ్‌మెంట్ టూల్స్‌పై పట్టు అవసరం. సీఎస్‌ఎస్, హెచ్‌టీఎంఎల్, రియాక్ట్ లాంటి వెబ్ డెవలప్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌లపై అవగాహన ఉండాలి. అజుర్, ఏడబ్ల్యూఎస్, జీసీపీ లాంటి క్లౌడ్ టెక్నాలజీ సంబంధ కోర్సులు నేర్చుకుంటే అదనపు ప్రయోజనం. సైబర్ సెక్యూరిటీ కోర్సులు, ఎన్‌క్రిప్షన్, నెట్‌వర్క్ సెక్యూరిటీ, ఎథికల్ హాకింగ్‌ల మీద నైపుణ్యం పొందాలి. గిట్, గిట్‌హబ్ వాడటం నేర్చుకోవాలి. ఇంటర్న్‌షిప్, ప్రాజెక్టుల ద్వారా అనుభవం పెంచుకోవడం మంచిది.