BDL Recruitment 2024 :ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) 361 ఇంజినీరింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు విశాఖపట్నం, హైదరాబాద్, భానూర్, బెంగళూరుల్లోని బీడీఎల్ కార్యాలయాల్లో, యూనిట్లలో పనిచేయాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- ప్రాజెక్ట్ ఇంజినీర్/ ప్రాజెక్ట్ ఆఫీసర్ - 136 పోస్టులు
- ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్/ ప్రాజెక్ట్ అసిస్టెంట్ - 124 పోస్టులు
- ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్/ ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్ - 83 పోస్టులు
- మొత్తం పోస్టులు - 361
విభాగాలు
BDL Engineering Jobs :మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, కెమికల్, ఎన్విరాన్మెంట్, హ్యూమన్ రిసోర్స్, ఫైనాన్స్, సివిల్, మెటలర్జీ, ఫిట్టర్, రేడియో మెకానిక్, టర్నర్, వెల్డర్, ప్లంబర్, ఎలక్ట్రో ప్లేటింగ్, కంప్యూటర్స్, ఎలక్ట్రీషియన్, మిల్ రైట్, డీజిల్ మెకానిక్, రిఫ్రెజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్
విద్యార్హతలు
BDL Job Qualifications : అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే పని అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి
BDL Engineering Jobs Age Limit :2024 ఫిబ్రవరి 14 నాటికి అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు రుసుము
BDL Engineering Job Application Fee :
- ప్రాజెక్ట్ ఇంజినీర్ / ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు రూ.300 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఇతర పోస్టులకు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది.