Questions To Teachers On Children School First Day :వేసవి సెలవులు పూర్తవడంతో పాఠశాలలు అన్నీ తెరుచుకున్నాయి. సమ్మర్ హాలీడేస్లో ఫుల్గా ఎంజాయ్ చేసిన పిల్లలు.. బడిబాట పట్టారు. కాగా, సెలవుల తర్వాత పిల్లలను స్కూల్‌కు పంపే క్రమంలో చాలా మంది తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్తుంటారు. అయితే, ఇలా స్కూల్‌కు వెళ్లినప్పుడు ఊరికినే తిరిగి రాకుండా.. పిలల్ల గురించి పలు విషయాలను టీచర్లను అడిగి తెలుసుకోమంటున్నారు నిపుణులు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఏ స్థాయిలో ఉన్నారు ? :తల్లిదండ్రులు..పిల్లలతో కలిసి స్కూల్‌కు వెళ్లిన మొదటి రోజు.. గత సంవత్సరం తమ పిల్లలు ఎలా చదివారో తప్పక అడిగి తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వారు ఏ సబ్జెక్ట్‌లోతక్కువ ప్రతిభ కనబరిచారు.. దానికి గల కారణాలు ఏంటి అనే విషయాల గురించి టీచర్లను అడగాలని చెబుతున్నారు. దీనివల్ల తమ పిల్లవాడు చదువులో ఏ స్థాయిలో రాణిస్తున్నాడో పేరెంట్స్‌కు తెలుస్తుందని అంటున్నారు.
ఎంత చదివినా బుర్రకు ఎక్కడం లేదా - ఈ టిప్స్ పాటిస్తే ఆల్సెట్!
ప్రవర్తన ఎలా ఉంది ?:చాలా మంది పిల్లలు ఇంట్లో ఒక విధంగా.. పాఠశాలలో మరొక విధంగా ప్రవర్తిస్తుంటారు. అయితే, స్కూల్లో పిల్లల ప్రవర్తన.. తోటి విద్యార్థులతో ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే టీచర్‌లుపాఠాలుచెప్పేటప్పుడు శ్రద్ధతో వింటున్నారా ? లేదా అనేది కూడా కనుక్కోవాలని.. పిల్లలతో ఏవైనా గొడవలు పడుతున్నారా ? లేదా ? అనే విషయం కూడా అడగాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇతరుల పట్ల ఎలా ప్రవర్తించాలో పిల్లలకు నేర్పించవచ్చని.. తద్వారా జీవితంలో ఎత్తుకు ఎదుగుతారని అంటున్నారు.