తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

నో ఫీజ్- ఈజీగా సొంతంగా నేర్చుకోగలిగే 8 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్స్ ఇవే!

సులభంగాస సొంతంగా నేర్చుకోగలిగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్​లు ఇవే!

Easiest programming languages
Easiest programming languages (Getty Images, ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2024, 1:39 PM IST

Easiest Programming Languages :ఎన్నో కొత్తకొత్త అవకాశాలు అందించే ఐటీ రంగంలో ఉద్యోగం సంపాదించడం చాలా మంది కల. దాని కోసం కనిపించిన కోర్సులన్నీ చేస్తూ కష్టపడుతూ ఉంటారు. అయితే ట్రెండ్​కు తగిన విధంగా నేర్చుకునే స్కిల్క్​ను ఎంపిక చేసుకుంటే కోరుకున్న జాబ్​ను సులభంగా చేజిక్కించుకునే అవకాశం ఉంటుంది. అందుకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్​లపై పట్టు సాధించడం ముఖ్యం. కోర్సులతో సంబంధం లేకుండా స్వయంగా, సులభంగా నేర్చుకోగలిగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్​లు గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

స్ట్రక్చర్డ్‌ క్వరీ లాంగ్వేజ్‌ (SQL) :టెక్నాలజీ ఇండస్ట్రీలో ఎటువైపు వెళ్లాలన్నా SQL నైపుణ్యాలు చాలా అవసరం. ఎంతో డిమాండ్‌ ఉన్న డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, బిజినెస్‌ అనలిస్ట్‌ లాంటి ఉద్యోగాలకు SQLలో నైపుణ్యం తప్పనిసరి. డేటాను స్టోర్​ చేయడానికి, మార్చాడనికి, తొలగించడానికి SQL లాంగ్వేజ్​ వాడతారు. దీనిని నేర్చుకోవడం చాలా సులభం.

క్యాస్కేడింగ్ స్టైల్ షీట్​(CSS) :
వెజ్​పేజీని ఆకర్షణీయంగా మార్చడానికి ఉపయోగిస్తారు. ఇది HTML ఆధారంగా పని చేస్తుంది. వెబ్​పేజీలను, వెబ్​ అప్లికేషన్​ల లేఅవుట్​, ఫాంట్​ సైజ్​, రంగలను, గ్రాఫిక్స్​ యానిమేషన్​ను క్రియేట్​ చేయడానికి ఉపయోగిపడతుంది. దీనిని నేర్చుకోవడం కూడా సులభమే.

హైపర్​టెక్ట్ మార్క్​ప్​ లాంగ్వేజ్(HTML) :
హైపర్​టెక్ట్ మార్క్​ప్​ లాంగ్వేజ్ అనేది వెబ్​పేజీలను రూపొందిచడానికి ఉపయోగిస్తారు. ఈ లాంగ్వేజ్​ను నేర్చుకోవడం చాలా సులభం. టాగ్స్​, కమాండ్స్​ నేర్చుకోవడానికి సులభంగా ఉంటుంది. వైబ్​సైట్​ను రూపొందించే ఆసక్తి ఉంటే ఇది ఉపయోగపడుతుంది.

జావా(JAVA) :
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఉపయోగించే లాంగ్వేజ్ జావా. దీన్ని నేర్చుకోవడానికి ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. లార్జ్​ స్కేల్​ అప్లికేషన్స్​ను రూపొందించడానికి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ స్ట్రక్చర్​గా ఉపయోగడతుంది. ఆండ్రాయిడ్ యాప్​ డెవలప్​మెంట్​కు కూడా ఇది ముఖ్యం. డెవలపర్​గా రాణించాలనుకునే వారికి ఉపయోగపడుతుంది.

జావా స్క్రిప్ట్‌(JavaScript) :
జావా స్క్రిప్ట్​ బ్రౌజర్​ను రన్​ చేయడానికి ఉపయోగిస్తారు. HTML,CSS నేర్చుకుంటే ఇది సులభంగా అర్ధమవుతుంది. దీనితో డైనమిక్​ కంటెంట్​ని రూపొందించవచ్చు. గేమ్​లను కూడా డిసైజ్​ చేయొచ్చు.

PHP:
వెబ్​ డెవలప్​మెంట్​కు ఉపయోగించే సర్వర్​ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. నేర్చుకోవడానికి చాలా సులభంగానే ఉంటుంది. HTML వస్తే మరింత సులభంగా అర్థమవుతుంది. వర్డ్​ప్రెస్, కంటెంట్ మేనేజ్​మెంట్ సిస్టమ్, వెబ్​సైట్​ రూపొందిచండానికి ఉపయోగిస్తారు. వెబ్​ డెవలపర్​గా రాణించాలనుకునే వారికి ఇది ముఖ్యమైన లాంగ్వేజ్.

(పైతాన్)Python
పైతాన్​కు ప్రస్తుతం మార్కెట్​లో బాగా డిమాండ్ పెరిగిపోయింది. సీ, జావాలతో పోలిస్తే దీనిలో ప్రోగ్రామ్స్ చిన్నవిగా ఉంటాయి. సింటాక్స్ కూడా సులువుగా అర్థమయ్యేలా ఉంటుంది. వెబ్​ డిజైన్, డేటా అనాలిసిస్, ఆర్టిఫిషియల్ ఇంటిల్​జెన్స్ వంటి వాటిల్లో ఉపయోగించే లాంగ్వేజ్. దీనిని నేర్చుకోవడం చాలా సులభం.

రూబీ(Ruby):
ఇది ఒక ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్. వెబ్​ డిజైన్​ను అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడుతుంది. దీనిని అర్థం చేసుకోవడం సులభం. దాదాపు ఇంగ్లీష్​లోనే ఉంటుంది. రూబీ సింటాక్స్​ని ఉపయోగించడం కూడా చాలా సులభం. కామన్​ గేట్​వే ఇంటర్​ఫేస్ స్క్రిప్ట్​లను రాయడానికి రూబీనీ ఎక్కువగా ఉపయోగిస్తారు.

ABOUT THE AUTHOR

...view details