Zomato CEO Deepinder Goyal Marriage : ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సీఈఓ దీపిందర్, మెక్సికోకు చెందిన మోడల్, పారిశ్రామికవేత్త అయిన గ్రేసియా మునోజ్ను వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం.
రహస్యంగా పెళ్లి!
దీపిందర్ ఐఐటీలో చదివే రోజుల్లోనే కంచన్ జోషిని వివాహం చేసుకున్నారు. తరువాత వారిద్దరూ విడిపోయారు. దీనితో ఆయన రహస్యంగా రెండో వివాహం చేసుకున్నారు. వాస్తవానికి నెల క్రితమే ఈ పెళ్లి జరగగా, తాజాగా ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.
మాజీ మోడల్
Who Is Grecia Munoz :మునోజ్ ఇన్‌స్టాగ్రామ్ బయో ప్రకారం, ఆమె మెక్సికోలో జన్మించారు. మొదట్లో ఆమె మోడలింగ్ చేసేవారు. మెట్రోపాలిటన్ ఫ్యాషన్ వీక్ 2022 విజేతగా నిలిచారు. తరువాత దానికి స్వస్తి చెప్పి, సొంతంగా స్టార్టప్ మొదలుపెట్టారు. ప్రస్తుతం దానినే నడిపిస్తున్నారు.
కొత్త ఇంటికి వచ్చా
మునోజ్ ప్రస్తుతం భారత్లోనే ఉంటున్నారు. ఆమె దిల్లీకి వచ్చి, కొన్ని చారిత్రాత్మక ప్రదేశాలు సందర్శించారు. వాటి ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ, 'నా కొత్త ఇంట్లో, నా కొత్త జీవితం' అనే క్యాప్షన్ ఇచ్చారు.