తెలంగాణ

telangana

ETV Bharat / business

సిబిల్​ స్కోర్​ Vs క్రెడిట్​ స్కోర్​ - ఈ రెండింటి మధ్య తేడాలేంటో మీకు తెలుసా?

CIBIL Score Vs Credit Score: "క్రెడిట్​ స్కోర్​, సిబిల్​ స్కోర్​.." క్రెడిట్ కార్డు వాడే వారందరికీ ఈ రెండు పదాలు తెలుసు. కానీ.. వీటి మధ్య తేడా ఏంటన్నది మాత్రం తక్కువ మందికే తెలుసు. ఇవి రెండూ ఒకటే అనుకునేవారు చాలా మందే ఉన్నారు. కానీ.. ఇవి వేర్వేరు! ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

CIBIL Score Vs Credit Score
CIBIL Score Vs Credit Score

By ETV Bharat Telugu Team

Published : Mar 9, 2024, 11:00 AM IST

CIBIL Score Vs Credit Score:క్రెడిట్ కార్డు వినియోగదారులందరికీ.. క్రెడిట్​ స్కోర్ లేదా సిబిల్​ స్కోర్​​ గురించి తెలుసు. ఇది చాలా ముఖ్యమైనది కూడా! ఎందుకంటే.. ఈ స్కోర్ ఆధారంగానే రుణ సంస్థలు లేదా బ్యాంకులు రుణాలు​ మంజూరు చేస్తాయి. కస్టమర్ ఆర్థిక సామర్థ్యాన్ని కూడా రుణ సంస్థలు క్రెడిట్ స్కోర్​తోనే అంచనా వేస్తాయి. అందుకే ఈ స్కోరుకు అంత ప్రాధాన్యం ఉంటుంది. అయితే.. చాలా మంది సిబిల్​ స్కోర్​, క్రెడిట్​ స్కోర్​ రెండూ ఒకటే అని భావిస్తారు. కానీ.. ఈ రెండు ఒకటి కాదు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

క్రెడిట్​ స్కోర్​ అంటే ఏమిటి:క్రెడిట్​ స్కోర్​ అనేది.. ఒక వ్యక్తి క్రెడిట్ హిస్టరీ గురించి తెలిపే సూచిక. ఇది 300 నుంచి 900 మధ్య ఉంటుంది. ఈ నంబర్ ఎంత ఎక్కువగా ఉంటే.. ఆ వ్యక్తి క్రెడిట్ హిస్టరీ అంత క్లీన్​గా ఉన్నట్టు లెక్క. 700 ప్లస్​లో ఉంటే చాలా బాగా మెయింటెయిన్ చేస్తున్నట్టు లెక్క. మరి, దీన్ని ఎలా నిర్ణయిస్తారంటే.. సదరు వ్యక్తి ఎంతెంత అప్పులు తీసుకున్నాడు? సమయానికి తిరిగి చెల్లించాడా? డిఫాల్టర్​గా మారాడా? ఎన్నిసార్లు ఫైన్​తో చెల్లించాడు? అతని క్రెడిట్​ లిమిట్ ఎంత? ఎంత వాడుతున్నాడు? ఇలా.. ప్రతినెలా కస్టమర్ వివరాలన్నీ సేకరించి.. అతని క్రెడిట్ హిస్టరీ ప్రిపేర్ అవుతుంది. ఈ హిస్టరీ ఆధారంగానే క్రెడిట్ స్కోర్ ప్రిపేర్ అవుతుంది. కొత్తగా అతనికి రుణం కావాలంటే.. బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు ఈ క్రెడిట్ స్కోర్​నే ఆధారంగా చేసుకుంటాయి.

సిబిల్​ స్కోర్​ అంటే ఏమిటి? : CIBIL అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(ఇండియా) లిమిటెడ్. పైన చెప్పుకున్న క్రెడిట్​ స్కోర్ ఉంది కదా.. దాన్ని అందించే ఒక సంస్థ. ఇలాంటి సంస్థలు, ఏజెన్సీలు ఇంకా చాలా ఉంటాయి. మరి.. సిబిల్ మాత్రమే ఎందుకు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది అంటే.. ఇది భారతీయ రిజర్వ్​ బ్యాంక్​ (RBI) అధీకృత క్రెడిట్ ఏజెన్సీ. ఇది ఎప్పటి నుంచో ఉన్న సంస్థ కావడంతో.. అందరికీ ఇది ఎక్కువగా పరిచయం. బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థల నుంచి.. వ్యక్తులకు సంబంధించిన లోన్స్​, క్రెడిట్ కార్డ్ పేమెంట్​ ట్రాన్సాక్షన్స్​ సమాచారం తీసుకొని.. క్రెడిట్ రిపోర్ట్స్​ తయారుచేస్తుంది. ఈ రిపోర్ట్స్​ ద్వారానే క్రెడిట్ స్కోర్‌ను ఫైనల్ చేస్తుంది. సిబిల్.. ఎన్నో ప్రధాన బ్యాంకులు, నాన్- బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, హౌజింగ్​ ఫైనాన్స్ కంపెనీలతో ఇంటరాక్ట్ అవుతుంది. సిబిల్​తోపాటు మరికొన్ని సంస్థలూ క్రెడిట్ స్కోర్ అందిస్తాయి.

క్రెడిట్​ స్కోర్​ అందించే ప్రధాన బ్యూరోలు:

  • CIBIL: భారత్‌లో అత్యంత ప్రసిద్ధ క్రెడిట్‌ ఏజెన్సీగా ‘సిబిల్‌’ ఉంది. ఈ కంపెనీని 2000లో స్థాపించారు. 60 కోట్లకు పైగా భారతీయులు, 3.2 కోట్ల కార్పొరేట్‌ సంస్థల క్రెడిట్‌ రిపోర్ట్‌లను ఈ సంస్థ నిర్వహిస్తోంది.
  • Equifax: ప్రపంచంలోని మూడు అతిపెద్ద క్రెడిట్‌ బ్యూరోలలో ఒకటైన ‘ఈక్విఫాక్స్‌’ 1899లో రిటైల్‌ క్రెడిట్‌ బిజినెస్‌గా ప్రారంభమైంది. ఇది 2010లో ఆపరేటింగ్‌ లైసెన్స్‌ను పొందింది. ఇది 1 నుంచి 999 వరకు క్రెడిట్​ స్కోరును సూచిస్తుంది.
  • Experian: ఇది కూడా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(SEBI) గుర్తింపు పొందింది. దీన్ని 2006లో స్థాపించగా.. 2010 నుంచి భారత్‌లో పనిచేస్తోంది.
  • CRIF High Mark: ఈ బ్యూరోను 2007లో స్థాపించగా.. 2010లో లైసెన్స్‌ పొందింది. దీని స్కోర్‌ పరిధి 300 నుంచి 850 వరకు ఉంటుంది.

క్రెడిట్​ కార్డ్​ యూజ్ చేస్తున్నారా? ఇకపై బిల్లింగ్ డేట్​ను మీరే ఫిక్స్​ చేసుకోవచ్చు!

భవిష్యత్ కోసం పొదుపు చేయాలా? 50-30-20 సూత్రాన్ని పాటించండి!

క్రెడిట్‌ కార్డ్‌ 'రివార్డ్​ పాయింట్స్​' పెంచుకోవాలా? ఈ సింపుల్ టిప్స్​ పాటించండి!

ABOUT THE AUTHOR

...view details