What Is Re KYC Online :మీకు బ్యాంక్ ఖాతా ఉన్నా లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేస్తున్నా లేదా ఇతర ఆర్థిక కార్యకలాపాలు సజావుగా జరగాలన్నా కచ్చితంగా కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. అప్పుడే మీ ఖాతాలకు భద్రత ఏర్పడుతుంది. అందుకే బ్యాంకులు అన్నీ తమ కస్టమర్లను 'పీరియాడిక్ అప్డేషన్ ఆఫ్ కేవైసీ' (రీ-కేవైసీ) చేసుకోవాలని సూచిస్తుంటాయి.
కారణమిదే!
ప్రస్తుత కాలంలో ఆన్‌లైన్ మోసాలు, సైబర్ ఫ్రాడ్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటిని నివారించేందుకు, కస్టమర్ల ఖాతాకు భద్రత కల్పించేందుకు, బ్యాంకులు ఎప్పటికప్పుడు కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకోమని తమ ఖాతాదారులను కోరుతుంటాయి. అయితే ఈ ప్రక్రియ ఎలా పూర్తి చేయాలో తెలియక చాలా మంది కస్టమర్లు ఇబ్బందిపడుతూ ఉంటారు.
ఆన్‌లైన్‌లోనే అప్డేట్ చేసుకోవచ్చు!
ప్రస్తుతం చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు ఆన్‌లైన్‌లోనే రీ-కేవైసీ అప్డేట్ చేసుకునే ఫెసిలిటీని కల్పిస్తున్నాయి. మరెందుకు ఆలస్యం బ్యాంక్ పోర్టల్స్‌లో మీ రీ-కేవైసీని ఎలా అప్డేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
నోట్ : బ్యాంకులను బట్టి కేవైసీ అప్డేట్ ప్రక్రియలో చిన్నచిన్న మార్పులు ఉంటాయి. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే, ప్రధానమైన బ్యాంకుల్లో ఈ కేవైసీ అప్డేట్ విధానం అంతా ఓకేలా ఉంటుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) :
- ముందుగా మీరు ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ పోర్టల్‌లోకి లాగిన్ కావాలి.
- My Accounts & Profile’ సెక్షన్‌లోకి వెళ్లి Update KYCపై క్లిక్ చేయాలి.
- మీ ఎస్‌బీఐ అకౌంట్‌ను ఎంచుకొని Nextపై క్లిక్ చేయాలి.
- తరువాత కేవైసీ అప్డేట్కు సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయాలి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
- హెచ్‌డీఎఫ్‌సీ పోర్ట్‌లో రీ- కేవైసీని చాలా సులువుగా చేసుకోవచ్చు.
- ఇందుకోసం ముందుగా హెచ్‌డీఎఫ్‌సీ వెబ్ పోర్టల్ ఓపెన్ చేయాలి.
- పర్సనల్ డీటైల్స్ విభాగంలో రీ-కేవైసీకి సంబంధించిన లింక్ ఉంటుంది.
- ఈ రీ-కేవైసీ లింక్‌పై క్లిక్ చేసి, అందుకు సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయాలి.