Warren Buffett Investment Tips : స్టాక్ మార్కెట్లో వారెన్ బఫెట్ గురించి తెలియనివారు ఉండరంటే అది అతిశయోక్తి కాదు. అత్యంత విజయవంతమైన, గొప్ప పెట్టుబడిదారుడు అతను. పెట్టుబడులు పెట్టి, గొప్ప సంపదను సృష్టించాలని ఆశించే ప్రతి ఒక్కరికీ ఆయన ఆదర్శప్రాయం. అందుకే 93 ఏళ్ల వారెన్ బఫెట్ చెప్పిన 5 ప్రధానమైన పెట్టుబడి సూత్రాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టకూడదు :అవగాహన లేని రంగాల్లో పెట్టుబడులు పెట్టడం పెద్ద రిస్క్ అవుతుందని వారెన్ బఫెట్ హెచ్చరిస్తూ ఉంటారు. నేడు చాలా మంది సరైన పరిజ్ఞానం లేకుండానే స్టాక్ మార్కెట్, క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ చేస్తున్నారు. దీనివల్ల భారీగా నష్టపోతున్నారు. అందుకే మనకు అర్థంకానీ వాటిలో, మనకు అనుభవం లేని వాటిలో పెట్టుబడులు పెట్టకూడదు.
చాలా మంది మంచి భూమ్లో ఉన్న స్టాక్లను కొనేస్తూ ఉంటారు. కానీ దాని ఫండమెంటల్స్ గురించి తెలుసుకోరు. టెక్నికల్ అనాలసిస్ చేయరు. పైగా ఎవరో చెప్పిన మాట విని, ఇన్వెస్ట్ చేసి, తరువాత భారీగా నష్టపోతుంటారు. కనుక మీరు ఏ రంగంలో పెట్టుబడులు పెట్టినా, దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోవాలి. వారెన్ బఫెట్ కూడా అదే చేస్తారు.
ఉదాహరణకు, 2016 వరకు వారెన్ బఫెట్ టెక్ స్టాక్స్‌లో ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదు. ఎందుకంటే ఆయనకు టెక్నాలజీ గురించిగానీ, టెక్ బిజినెస్ గురించి గానీ ఏమీ తెలియదు. ఆ తరువాత వాటి గురించి ఆయన పూర్తిగా తెలుసుకున్నారు. ఇలాన అన్ని వివరాలు తెలుసుకున్నాకనే, ఆయన యాపిల్ కంపెనీ స్టాక్స్ కొనుగోలు చేశారు. ఈ విధంగా మీరు కూడా పూర్తి అధ్యయనం చేసిన తరువాత మాత్రమే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలి.
2. భయం - అత్యాశ వద్దు!
స్టాక్ మార్కెట్లో చాలా మంది అత్యాశాపరులు ఉంటారు. మరికొందరు మార్కెట్లో ఓ మాత్రం ఒడుదొడుకులు వచ్చినా భయపడిపోతుంటారు. ఈ రెండూ సరైనవి కావని వారెన్ బఫెట్ చెబుతుంటారు.
'మార్కెట్లో అందరూ అత్యాశతో ఉన్నప్పుడు మీరు పెట్టుబడి పెట్టడానికి భయపడాలి. అందరూ భయపడుతూ ఉన్నప్పుడు మీరు ధైర్యంగా, తెలివిగా పెట్టుబడులు పెట్టాలి' అని వారెన్ బఫెట్ సూచిస్తుంటారు.
ఉదాహరణకు, 2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడింది. దీనితో చాలా మంది భయపడి తమ స్టాక్లను అమ్మేశారు. దీనితో బ్లూ-చిప్ స్టాక్స్ అన్నీ చాలా తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చాయి. ఈ అవకాశాన్ని వారెన్ బఫెట్ సద్వినియోగం చేసుకున్నారు. తక్కువ ధరలో లభిస్తున్న బ్లూచిప్ స్టాక్స్‌ను భారీ సంఖ్యలో కొనుగోలు చేశారు. ఆర్థిక మాంద్యం తగ్గిన తరువాత (2013లో) ఇవే ఆయనకు భారీ లాభాలను ఆర్జించిపెట్టాయి. ఒక అంచనా ప్రకారం ఆయన ఏకంగా 10 బిలియన్ డాలర్లు(రూ.83 వేల కోట్ల)కు పైగా లాభం సంపాదించారు.