తెలంగాణ

telangana

ETV Bharat / business

మీ కారులో ఈ సేఫ్టీ ఫీచర్ ఉందా? - లేదంటే ఇబ్బందే! - UV Cut Glasses in Cars

UV Cut Glasses Benefits : మనలో చాలా మంది కార్లలో సేఫ్టీ విషయానికొస్తే ఎక్కువగా సీట్ బెల్ట్‌లు, ఎయిర్‌బ్యాగ్‌లు, కారు క్వాలిటీ గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఇవే కాకుండా.. మీరు తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్ ఉంది. దీని ద్వారా ఆరోగ్యపరంగా, డ్రైవింగ్​పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇంతకీ, ఆ ఫీచర్ ఏంటో తెలుసా?

Benefits of UV Cut Glasses
UV Cut Glasses Benefits

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 9:53 AM IST

Benefits of UV Cut Glasses in Cars: మనం డిస్కస్ చేయబోతున్న సేఫ్టీ ఫీచర్.. UV కట్ గ్లాసెస్. ఇటీవల కాలంలో డ్రైవింగ్ చేసే వాళ్లకు ఇది ముఖ్యమైన భద్రతా ఫీచర్​గా మారింది. సూర్యకాంతి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు.. కారులోకి రాకుండా ఈ గ్లాసెస్ అడ్డుకుంటాయి. అంతేకాకుండా.. కళ్లకు పూర్తి స్థాయి రక్షణను అందిస్తాయి. ఈ కిరణాలు మన చర్మం, కళ్లపై పడినప్పుడు తీవ్రమైన హాని కలిగిస్తాయి. ఎక్కువ కాలం వాటికి గురైతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వేగంగా వృద్ధాప్యం రావడం, సన్ బర్న్ లాంటి ప్రాబ్లమ్స్​తోపాటు చర్మ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

సన్ లైట్ రెడ్యూస్ : UV కట్ గ్లాసెస్ మీ​ కారులో ఉంటే సూర్యరశ్మిని గణనీయంగా తగ్గిస్తాయి. దాదాపు 99శాతం యూవీ కిరణాలను వాహనంలోకి రాకుండా నిరోధిస్తాయి. ఈ ఫీచర్​ ఎండాకాలంలో డ్రైవర్లకు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. ముఖ్యంగా డ్రైవర్ కళ్లపై ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే కంటి, చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతాయి.

విజిబిలిటీ మెరుగుపడుతుంది : ఈ గ్లాసెస్ మీ కారులో ఉండడం ద్వారా మీరు పొందే మరో ప్రయోజనమేమిటంటే.. డ్రైవర్ విజిబిలిటీ మెరుగుపడుతుంది. సన్ లైట్, వేడి లోపలికి రాకుండా నిరోధిస్తాయి కాబట్టి.. ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది.

మీ కారుపై గీతలు పడ్డాయా - ఇలా ఈజీగా తొలగించండి!

ఇంటీరియర్‌ జీవితకాలాన్ని పెంచుతుంది : యూవీ కట్ గ్లాసెస్ మీ కారు ఇంటీరియర్​ త్వరగా పాడవకుండా కాపాడుతుంది. సాధారణంగా సూర్యకాంతి ఎక్కువగా పడడం వల్ల ఇంటీరియర్ వేగంగా కలర్ పోవడం, దెబ్బతినడం జరుగుతుంది. ఈ ఫీచర్ ఉంటే.. సన్​లైట్​ నుంచి ఇంటీరియర్​ను ఎక్కువ కాలం వచ్చేలా చేస్తుంది. ఫలితంగా.. కారు నిర్వహణ ఖర్చు కూడా తగ్గుతుంది.

ఏసీ అవసరాన్ని తగ్గిస్తాయి : ఈ ఫీచర్ మీ కారులో ఉండడం మీరు పొందే మరో ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే.. ఏసీ(ఎయిర్ కండిషనింగ్) అవసరాన్ని తగ్గిస్తుంది. UV కట్ గ్లాసెస్ ఉష్ణోగ్రతను వాహనం లోపలికి రాకుండా నియంత్రిస్తాయి కాబట్టి.. ఏసీ అధికంగా వినియోగించాల్సిన అవసరం ఉండదు. ఇంకా.. UV కట్ గ్లాసెస్ వాహనం లోపల ఉష్ణోగ్రతను నియంత్రించడం ద్వారా .. ఫ్యూయెల్ కూడా కొంత ఆదా అవుతుంది. ఫలితంగా.. కారు మైలేజ్ పెరుగుతుంది. మీకు డబ్బు సేవ్ అవుతుంది.

ఇన్ని ప్రయోజనాలు అందిస్తున్న దృష్ట్యా.. కార్లలో UV కట్ గ్లాసెస్​కు ఆదరణ పెరుగుతోంది. దేశంలో రోడ్డు ప్రమాదాలు సాధారణంగా మారిన నేఫథ్యంలో.. కార్లు కొనుగోలు చేసేవారు సేఫ్టీకి మరింత ప్రాధాన్యం ఇస్తున్నారు. మంచి భద్రత, సౌకర్యాలు ఉన్న కార్లను ఎంచుకుంటున్నారు. దీంతో.. ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు UV కట్ గ్లాసెస్​ అమర్చుతున్నాయి. మరి, మీరు కొత్త కారు కొనే ఆలోచనలో ఉంటే.. ఈ ఫీచర్​ ఉన్న కారు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

రాత్రివేళ​ కారు హెడ్​లైట్స్ సరిగ్గా వెలగట్లేదా? - ఈ టిప్స్ పాటించారంటే ఫుల్ లైటింగ్!

కారు బ్రేకులు త్వరగా దెబ్బతింటాయి - ఇలా చేయండి

ABOUT THE AUTHOR

...view details