Upcoming Bikes Under 1 Lakh : బైక్స్, స్కూటీస్ అంటే యువతకు ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే చాలా మందికి ఆశ ఉన్నా, వారి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు ఉండవు. అందుకే ఇలాంటి వారిని టార్గెట్ చేసుకుని, ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తమ లేటెస్ట్ బైక్స్, స్కూటీలను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. పైగా వీటిలో లేటెస్ట్ ఫీచర్స్, స్పెక్స్‌ను పొందుపరుస్తున్నాయి. యువత ఆర్థిక పరిస్థితుల రీత్యా, మంచి మైలేజ్ ఇచ్చేలా సదరు టూ-వీలర్స్‌ను తీర్చిదిద్దుతున్నాయి. ఇక 2024 సంవత్సరానికి వస్తే, పలు ప్రముఖ టూ-వీలర్ తయారీ కంపెనీలు తమ లేటెస్ట్ బ్రాండెడ్ బైక్‌లను లాంఛ్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. మరెందుకు ఆలస్యం వాటిలోని టాప్-5 బైక్స్ అండ్ స్కూటీస్‌పై ఓ లుక్కేద్దాం రండి.
1. Liger X :లైగర్ ఎక్స్ అనేది ఒక ఆటో-బ్యాలెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్. దీనిని ఆటో ఎక్స్పో 2023లో ప్రదర్శించారు. ముంబయికి చెందిన లైగర్ మొబిలిటీ సంస్థ భారతదేశంలోనే మొదటిసారిగా ఈ సెల్ఫ్ బ్యాలెన్స్డ్ ఈ-స్కూటర్‌ను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
లైగర్ ఎక్స్ బైక్‌లో రెండు వేరియంట్లు ఉంటాయి. అవి: X, X Plus. లైగర్ ఎక్స్ వేరియంట్ రేంజ్ 60 కి.మీ. లైగర్ ఎక్స్ ప్లస్ బండి రేంజ్ 100 కి.మీ ఉంటుందని కంపెనీ చెబుతోంది. నియో-రెట్రో డిజైన్‌తో వస్తున్న ఈ X, X Pluse స్కూటీలు గరిష్ఠంగా గంటకు 65 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి.
ఈ లైగర్ ఎక్స్ స్కూటర్లు 4జీ, జీపీఎస్ ఎనేబుల్డ్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని కలిగి ఉంటాయి. అంతేకాదు ఇది ప్రీమియం టీఎఫ్టీ కన్సోల్‌తో వస్తుంది. దీని ద్వారా కాల్స్, మెసేజ్ అలర్ట్‌లు కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ లైగర్ ఎక్స్ బహుశా 2024 నవంబర్‌లో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర సుమారుగా రూ.90 వేలు ఉండవచ్చని ఓ అంచనా.
2. TVS Fiero 125 :ఈ టీవీఎస్ కంపెనీ 2025 జనవరిలో ఫియరో 125 బైక్‌ను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ స్పోర్టీ బైక్‌లో 125 సీసీ, 3 వాల్వ్ ఎయిర్-కూల్డ్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ మోటార్ ఉంటుంది. ఇది 11.38 పీఎస్ పవర్, 11.2 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుందని తెలుస్తోంది.
టీవీఎస్ కంపెనీ ఈ ఫియరో 125 బైక్‌ను హోండా ఎస్పీ 125, హీరో గ్లామర్ 125, బజాజ్ పల్సర్ 125లకు పోటీగా తీసుకువస్తోంది. బహుశా దీని ధర రూ.80,000 వరకు ఉండొచ్చని ఓ అంచనా.