Best Co Branded Credit Cards :మీరు కొన్ని ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులను ఎక్కువగా షాపింగ్ చేస్తుంటారా? ఆ కొనుగోళ్లపై ఆకర్షణీయమైన రాయితీలను కోరుకుంటున్నారా? అయితే కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు మీ అవసరాలను పూర్తిస్థాయిలో తీరుస్తాయి. తగినన్ని ప్రయోజనాలను అందిస్తాయి. ఎందుకంటే ఈ రకం క్రెడిట్ కార్డులను ఆయా బ్రాండెడ్ ఉత్పత్తుల కంపెనీలు, బ్యాంకులు కలిసి జారీ చేస్తుంటాయి. 2025 సంవత్సరంలో మీరు పరిశీలించదగిన టాప్-6 కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
టాప్-6 కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్
1. 'ఫిన్ బూస్టర్' (Fin Booster) క్రెడిట్ కార్డు ఫీచర్లు
- ఫిన్ బూస్టర్ అనే కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును యస్ బ్యాంకు, బ్యాంక్ బజార్ సంయుక్తంగా జారీ చేస్తున్నాయి. దీనికి మొదటి సంవత్సరంలో ఎలాంటి ఫీజూ లేదు.
- యస్ బ్యాంకు, బ్యాంక్ బజార్ సంయుక్తంగా జారీ చేసే క్రెడిట్ కార్డు ఇది. దీనితో షాపింగ్ చేయగా వచ్చే రివార్డు పాయింట్లపై ఎక్స్‌పరీ తేదీ అనేది ఉండదు.
- ఆన్‌లైన్‌లో నిత్యావసరాలు, దుస్తుల షాపింగ్ చేసి, ఈ కార్డుతో చెల్లింపులు చేస్తే 3 రెట్లు ఎక్కువ రివార్డు పాయింట్లు వస్తాయి.
- డైనింగ్ చేసి ఈ కార్డుతో పేమెంట్ చేసినా, ఆన్‌లైన్‌లో దీని ద్వారా డైనింగ్ ఆర్డర్లు ఇచ్చినా 5 రెట్లు ఎక్కువ రివార్డు పాయింట్లు లభిస్తాయి.
- ఇంధనం కాకుండా ఇతరత్రా రిటైల్ కొనుగోళ్లకు ఈ కార్డుతో చెల్లింపులు చేస్తే ప్రతీ రూ.200 చెల్లింపునకు 2 పాయింట్లు వస్తాయి.
- రివార్డు పాయింట్లను మీరు స్నేహితులు, కుటుంబీకులతో షేర్ కూడా చేసుకోవచ్చు. లేదంటే వాటిని క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌లా వాడుకోవచ్చు.
- రూ.400 నుంచి రూ.5వేలలోపు ఇంధన చెల్లింపులలో 1 శాతం వరకు సర్‌ఛార్జ్ మాఫీ అవుతుంది. ప్రతీ నెలలో గరిష్ఠంగా రూ.125 వరకు ఈవిధంగా సర్‌ఛార్జ్ మాఫీని పొందొచ్చు.
- కార్డుదారుడికి రూ.2.50 లక్షల ప్రమాద బీమా వసతి ఉంటుంది.
- క్రెడిట్ ఫిట్‌నెస్ ట్రాకర్‌ను కార్డుదారుడికి ఇస్తారు. ఇందులో నెలవారీ క్రెడిట్ ఫిట్‌నెస్ రిపోర్ట్‌ను చూసుకోవచ్చు. క్రెడిట్ ఫిట్‌నెస్ ట్రాకర్ సంవత్సరం ఫీజు రూ.400. కార్డు ద్వారా ఏటా రూ.1 లక్షకుపైగా లావాదేవీలు చేస్తే ఈ ఫీజును మినహాయిస్తారు.
2. RBL Bank BankBazaar SaveMax Credit Card
- 'ఆర్‌బీఎల్ బ్యాంక్ బ్యాంక్‌బజార్ సేవ్‌మ్యాక్స్' క్రెడిట్ కార్డుకు కూడా మొదటి సంవత్సరంలో ఎలాంటి ఫీజూ లేదు.
- ఈజీ ఈఎంఐలు : క్రెడిట్ కార్డు ద్వారా రూ.2,500కుపైగా ఖర్చులు చేస్తే వాటిని ఈఎంఐలుగా మార్చుకోవచ్చు.
- ఇన్‌స్టా ఫండ్స్ : క్రెడిట్ కార్డు నుంచి నేరుగా బ్యాంకు ఖాతాలోకి నగదును పంపుకునే సౌకర్యం ఉంటుంది.
- రివార్డు పాయింట్లు : నిత్యావసరాల ఖర్చులపై 5 రెట్లు ఎక్కువ పాయింట్లను పొందొచ్చు. (ప్రతినెలా 1000 పాయింట్ల వరకు)
- క్యాష్ బ్యాక్ ఆఫర్లు : బుక్ మై షో, జొమాటోలలో చేసే లావాదేవీలపై 10 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది (ఒక్కో మర్చంట్ వద్ద ప్రతినెలా రూ.100)
- ఈఎంఐ ఇన్ఫినిటీ పాస్ : ఈఎంఐలను మరింత చిన్న మొత్తంగా విభజించుకునే క్రమంలో విధించే ఛార్జీలపై 100 శాతం రాయితీ లభిస్తుంది.
- ఆర్‌బీఎల్ బ్యాంక్ మైకార్డ్ యాప్ : ఈ యాప్‌లోకి వెళ్లి కార్డుకు సంబంధించిన అన్ని వివరాలు చూడొచ్చు.
- కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ : ఈ కార్డుతో రిటైల్ దుకాణాల్లో రూ.5వేల దాకా కాంటాక్ట్ లెస్ పేమెంట్లు చేయొచ్చు.
3. Standard Chartered EaseMyTrip Credit Card Key Features
- 'స్టాండర్డ్ ఛార్టర్డ్ ఈజ్ మై ట్రిప్' క్రెడిట్ కార్డుకు మొదటి సంవత్సరంలో ఫీజు రూ.350.
- మనదేశంలో, విదేశాల్లో ఉన్న హోటళ్లు బుక్ చేసుకుంటే 20 శాతం రాయితీ వస్తుంది. దేశంలోని హోటళ్ల బుకింగ్‌పై గరిష్ఠంగా రూ.5వేలు, విదేశాల్లోని హోటళ్ల బుకింగ్‌పై గరిష్ఠంగా రూ.10వేలు రాయితీ ఇస్తారు.
- దేశీయ, విదేశీ విమానాల బుకింగ్స్‌పై 10 శాతం రాయితీ వస్తుంది. దేశీయ విమానాలపై గరిష్ఠంగా రూ.1,000, విదేశీ విమానాలపై గరిష్ఠంగా రూ.5,000 రాయితీ ఇస్తారు.
- బస్సుల బుకింగ్‌ల విలువ రూ.500కు మించితే రూ.125 రాయితీ లభిస్తుంది.
- మూడు నెలలకోసారి విమానాశ్రయాలలో 1 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంజ్ ఇస్తారు.
- ఏటా 2సార్లు అంతర్జాతీయ విమానాశ్రయ లాంజ్‌లలోకి అనుమతిస్తారు. ప్రయారిటీ పాస్ లభిస్తుంది.
- రివార్డుపాయింట్లపై ఎలాంటి పరిమితీ లేదు. ఏటా గరిష్ఠంగా రూ.32వేల దాకా ప్రయోజనాలను అందుకోవచ్చు.
- డిస్కౌంట్లను పొందేందుకు "EMTSCB" అనే కోడ్‌ను వినియోగించాలి.